Movie News

పెళ్ళి పేరుతో తనను మోసం చేసాడంటూ.. హీరో ఆర్యపై చీటింగ్ కేసు..

ఎన్నో అంచనాలపై వచ్చిన ‘సార్పట్ట’ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. అంచనాలకు దగ్గట్టూ రానిస్తోంది. విమర్శకులు సైతం ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఓటీటీ వేదికగా రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఆర్య.. అతడి భార్య సాయేషా సైగల్ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది.

దీంతో ఆ ఇంట రెండు పండగలు ఒక్కసారే వచ్చినట్లు అయింది. ఇటు సినిమా హిట్ టాక్ తెచ్చుకొని మంచి సంతోషంలో ఉండగా.. ఇలా అమ్మాయి పుట్టడంతో కుటుంబం మొత్తం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఆర్యపై జర్మనీకి చెందిన తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడని..అంతే కాకుండా తన వద్ద రూ.70 లక్షల వరకు వసూలు చేశాడని జర్మనీకి చెందిన విజ్డా ఆన్​లైన్​లో కంప్లైంట్ చేసింది.

వాళ్లిద్దరు ఒకరినొకరు చేసుకున్న వాట్సాప్ చాట్ ను కూడా చూపించింది. ఆర్య తర్వాతి సినిమాలు విడుదల కాకుండా బ్యాన్ విధించాలని ఆమె కోరింది. ఈ కేసుపై గురువారం విచారణ జరిగింది. మరిన్ని ఆధారాలు సేకరించాలని జడ్జి.. పోలీసులను కోరారు. ఆగస్టు 17కు విచారణను వాయిదా వేశారు. అయితే ఈ విషయమై ఆర్య, అతడి టీమ్​ నుంచి ఎలాంటి స్పందన లేదు.

అతడు సాయేషా లవ్ చేసింది ఎప్పుడంటే.. నాని ‘భలే భలే మగాడివోయ్’కు తమిళ రీమేక్​ ‘గజినికాంత్’ సినిమా షూటింగ్​లో కలుసుకున్నారు. అప్పటి నుంచే వారి మధ్య లవ్ పుట్టుకొచ్చింది. తర్వాత వీళ్లిద్దరు కలిసి 2019 మార్చి 10న పెళ్లి చేసుకున్నారు. ఆర్య వివాహ అనంతరం ‘టెడ్డీ’ సినిమా, కన్నడలో ‘యువరత్న’ సినిమా చేశారు. సాయేషా గర్భం దాల్చిన విషయం ఆమె ప్రసవించిన తర్వాత హీరో విశాల్ చెప్పే వరకు ఎవరకీ తెలియదు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago