Featured

నాగార్జున తో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేసాం.. కానీ అలా ఆగిపోయింది: గోపాల్ రెడ్డి

ఒక చిత్రాన్ని తెరపై అద్భుతంగా చూపించాలంటే కేవలం నటీనటులు దర్శకులు మాత్రమే కాకుండా సినిమాకు ఫోటోగ్రాఫర్ కూడా ఎంతో అవసరం.ఈ సినిమాటోగ్రఫీ కారణంగానే ఒక అద్భుతమైన సినిమా అని మనం చూస్తూ ఆనందించగలరు. ఈ విధంగా ఎన్నో విజయవంతమైన సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఎస్ గోపాల్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అసిస్టెంట్ కెమెరామెన్ నుంచి కెమెరామెన్ దర్శకుడిగా నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకున్న గోపాల్ రెడ్డి తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. ఈ క్రమంలోనే తన సినీ జీవితంలో జరిగిన కొన్ని అద్భుతమైన సంఘటనలను గురించి పంచుకున్నారు.

ఈ క్రమంలోనే ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన గోపాల్ రెడ్డి గారిని అలీ ఆశక్తికరమైన ప్రశ్నలు వేస్తూ అతని నుంచి సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే ఎస్ గోపాల్ రెడ్డి అంటే ఇంటి పేరా..? అనడంతో ఎస్ అంటే శెనగల వేణుగోపాల్ రెడ్డి. పేరులో చిన్నప్పుడే వేణుని కట్ చేయడం వల్ల గోపాల్ రెడ్డిగా మారానని తెలిపారు. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి ఎన్నో ప్రశ్నలు అవి అడగడంతో గోపాల్ రెడ్డి తమదైన రీతిలో సమాధానం చెప్పాడు.

ఈ క్రమంలోనే అప్పట్లోనే నాగార్జున గారితో కలిసి పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించాలని భావించారంటగా… అని అడగడంతో గోపాల్ రెడ్డి స్పందిస్తూ.. అవును నాగార్జున తో పాన్ ఇండియా చిత్రాన్ని ప్లాన్ చేసాము.ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ అశోక్‌ మెహతా రాసిన స్క్రిప్ట్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాలని భావించాము. ఇందులో హీరో 48 గంటలలో తనకు విషం ఎక్కించిన ముగ్గురు పిల్లలను చంపే సన్నివేశం ఆధారంగా తెరకెక్కుతుంది. అయితే ఈ ముగ్గులు మూడు రాష్ట్రాలలో ఉంటారు.

హీరో విలన్ లను వెతుకుతున్న మార్గంలో మధ్యలో హీరోకి సంబంధించిన ఫ్లాష్ బ్లాక్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ విధంగా నాగార్జున హీరోగా పాన్ ఇదే చిత్రాన్ని ప్లాన్ చేయగా ఇందులో నటించడానికి డింపుల్‌ కపాడియా, అనుపమ్‌ ఖేర్‌ తదితరుల్ని ఎంపిక చేశాం. అంతా సిద్ధమైంది ఇక వారంలో సినిమా ప్రారంభించబోతున్నామన్న సమయంలో నాకూ కె.ఎల్‌. నారాయణకి, నాగార్జున సోదరుడు వెంకట్‌కి కొన్ని సన్నివేశాలలో మార్పులు చోటు చేయడం మంచిది అనిపించింది. అయితే ఈ విధంగా మార్పులు చేయడానికి అశోక్ మెహతా ఒప్పుకోకపోవడంతో ఈ సినిమా వాయిదా పడిందని ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago