మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ముఖ్యంగా ఎడిడిటీ, వికారం, వాంతులు, గ్యాస్ వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. గర్భధారణ సమయంలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ పెరిగేటప్పుడు పేగుల్లో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఇవి వాంతులు, నోటిలో తిరిగి ఆహారం, గుండెల్లో మంట మరియు పూతల రూపంలో కనిపిస్తాయి. అయితే వీటిని కొన్ని చిట్కాల ద్వారా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ శాతం మహిళల్లో ఈ సమస్యలు కనిపిస్తుంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చి మొదటి నెల చివరి వారంలో వాంతులు లేదా వికారం సమస్య ఉత్పన్నమవుతుంది. ఈ సమయంలో మందులను ఎక్కువగా తీసుకోకూడదు. హానికరమైన మందులు శిశువుకు హాని కలిగిస్తాయి.
కాబట్టి డాక్టర్ సలహాను పాటించి మందులను వాడాల్సి ఉంటుంది. ఖాళీ కడుపుతో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఆహారం తరచూ తింటూ ఉండాలి. ప్రెగ్నెన్సీ వచ్చిన ఆరో నెలలో ఎక్కువగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతుంటారు. అధిక కొవ్వు, కారం ఉన్న ఆహారాన్ని తీసుకోకుండా ఉండటం మంచిది. టీ, కాఫీలాంటి వాటికి దూరంగా ఉండాలి.
భోజనం తర్వాత నీటిని ఎక్కువగా తీసుకోకూడదు. గర్భధారణ సమయంలో వాంతులు, ఆమ్లత్వం కంటే అల్సర్ తక్కువగా ఉంటుంది. దీని కేసులు చాలా అరుదు కాని తీవ్రంగా ఉంటాయి. ఏ సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించడం అనేది చాలా మంచిది. ఎలాంటి నిర్లక్ష్యం చేసినా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…