General News

ఫిక్స్ డ్ డిపాజిట్ చేసేవారికి ముఖ్య గమనిక.. ఎస్ బీఐ నుంచి మరో స్కీమ్.. ?

సాధారణంగా ఎవరైనా ఎక్కువ మనీ ఉన్నప్పుడు బ్యాంకుల్లో దాచుకుంటారు. దీనికి గల కారణం ఏంటంటే.. వాటికి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఎప్పుడంటే అప్పడు డబ్బులను మనం విత్ డ్రా చేసుకోవచ్చు. ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసే వారికి ఇలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మనకు అవసరమైనప్పుడు డబ్బులను తీసుకున్నప్పడు వాటికి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ సదుపాయాన్ని ప్రేవేశపెడుతోంది.

ఈ స్కీంలో మీరు పిక్స్‌డ్ డిపాజిట్ చేసిన డబ్బు నుంచి అవసరమైతే ATM ద్వారా డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీ FD కి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. అంతేకాకుండా మీ అవసరాలు కూడా నెరవేరుతాయి. ఎలాంటి పెనాల్టీలు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎస్బీఐ ప్రవేశ పెట్టిన ఈ స్కీం అనేది టర్మ్ డిపాజిట్ లాంటిది. ఇది పొదుపు లేదా కరెంట్ ఖాతాతో లింక్ అయి ఉంటుంది. కస్టమర్‌కు డబ్బు అవసరమైతే ఆ లింక్డ్ ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.

ఒక వేళ అందులో తగినంత డబ్బులు లేనట్లయితే MODS నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. మనీ 9 నివేదిక ప్రకారం.. MODS అనేది ఒక రకమైన టర్మ్ డిపాజిట్. ఉదాహరణకు మీరు మధ్యలో డబ్బును ఉపసంహరించుకుంటే మిగిలిన మొత్తానికి బ్యాంకు వడ్డీ కూడా చెల్లిస్తుంది. ఈ పథకంలో మనం రూ. 10,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి అనేది ఉండదు. ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.
ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు SBI MODS తెరుస్తారు. ఈ స్కీమ్‌లోని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ప్రీమెచ్యూర్ విత్‌డ్రా సౌకర్యాన్ని కూడా కలిగి ఉంటుంది.

తద్వారా మీకు అవసరమైనప్పుడు డబ్బును తీసుకోవచ్చు. బ్యాంక్ రుణాలు , నామినేషన్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తుంది. ఇలా ఉండాలంటే దీనికి బ్యాలెన్స్ అనేది అవసరం. దీనిలో ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు అనేవి 45 రోజుల వరకు ఒక విధంగా.. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు మరో రకమైన వడ్డీ లభిస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago