సాధారణంగా ఎవరైనా ఎక్కువ మనీ ఉన్నప్పుడు బ్యాంకుల్లో దాచుకుంటారు. దీనికి గల కారణం ఏంటంటే.. వాటికి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఎప్పుడంటే అప్పడు డబ్బులను మనం విత్ డ్రా చేసుకోవచ్చు. ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసే వారికి ఇలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే మనకు అవసరమైనప్పుడు డబ్బులను తీసుకున్నప్పడు వాటికి ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే అటువంటి పరిస్థితుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ సదుపాయాన్ని ప్రేవేశపెడుతోంది.

ఈ స్కీంలో మీరు పిక్స్‌డ్ డిపాజిట్ చేసిన డబ్బు నుంచి అవసరమైతే ATM ద్వారా డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీ FD కి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. అంతేకాకుండా మీ అవసరాలు కూడా నెరవేరుతాయి. ఎలాంటి పెనాల్టీలు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ఎస్బీఐ ప్రవేశ పెట్టిన ఈ స్కీం అనేది టర్మ్ డిపాజిట్ లాంటిది. ఇది పొదుపు లేదా కరెంట్ ఖాతాతో లింక్ అయి ఉంటుంది. కస్టమర్‌కు డబ్బు అవసరమైతే ఆ లింక్డ్ ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.
ఒక వేళ అందులో తగినంత డబ్బులు లేనట్లయితే MODS నుంచి విత్ డ్రా చేసుకోవచ్చు. మనీ 9 నివేదిక ప్రకారం.. MODS అనేది ఒక రకమైన టర్మ్ డిపాజిట్. ఉదాహరణకు మీరు మధ్యలో డబ్బును ఉపసంహరించుకుంటే మిగిలిన మొత్తానికి బ్యాంకు వడ్డీ కూడా చెల్లిస్తుంది. ఈ పథకంలో మనం రూ. 10,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పరిమితి అనేది ఉండదు. ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.
ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు SBI MODS తెరుస్తారు. ఈ స్కీమ్‌లోని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ప్రీమెచ్యూర్ విత్‌డ్రా సౌకర్యాన్ని కూడా కలిగి ఉంటుంది.
తద్వారా మీకు అవసరమైనప్పుడు డబ్బును తీసుకోవచ్చు. బ్యాంక్ రుణాలు , నామినేషన్ వంటి సౌకర్యాలు కూడా లభిస్తుంది. ఇలా ఉండాలంటే దీనికి బ్యాలెన్స్ అనేది అవసరం. దీనిలో ఏడు రోజుల నుంచి 10 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్లు అనేవి 45 రోజుల వరకు ఒక విధంగా.. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు మరో రకమైన వడ్డీ లభిస్తుంది.































