Featured

ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా, ఆకలిని చంపుకున్న అభినవ శ్రీశ్రీ గా కమల్ హాసన్ నటన.. అదరహో !

“సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్… స్వతంత్ర భారతాన చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్.. మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ..” ఈ ఒక్కపాట చాలు సినిమా కథ మొత్తం వివరించడానికి… అఖండ భారతాన ఆకలిదప్పులతో అలమటించే నిరుద్యోగ యువతీ యువకుల జీవనశైలిని ఆత్రేయ తన సిరా చుక్కతో కాగితంపై నుంచాగా.. ఎమ్మెస్ విశ్వనాథన్ అందమైన బాణీతో సంగీతాన్ని అందించగా ఎస్పీ బాలు తన గాత్రంతో ప్రాణం పోసారని చెప్పవచ్చు.

ఆత్రేయ మనసుకవి మాత్రమే కాదు.. మోడువారిన జీవితాల గమనాన్ని ఆచితూచి వడపోసిన నేర్పరి. ఇప్పుడు వెబ్ సిరీస్ లకు అలవాటు పడిన యువత 1980 ప్రాంతంలో వచ్చిన కళాత్మక గుణాత్మక చిత్రాలను ఒక విధంగా మిస్సయ్యారనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు ప్రేమ, పెళ్లి, ప్రతీకారము లాంటి చిత్రాలను చూసిన ప్రేక్షకులు 1981లో దర్శకుడు బాలచందర్ తెలుగు, తమిళ భాషల్లో ఆకలి రాజ్యం సినిమా నిర్మించారు. ఆయన నిరుద్యోగ యువత ఆకలిదప్పులను ఎలుగెత్తి చూపిన గొప్ప దర్శకుడు. అఖండ భారతం వేద పురాణాలతో భాసిల్లింది.సంతానానికి కొదవ లేదు కానీ సంపాదనే కొరవడింది. కోరలుచాచిన నిరుద్యోగ కాటుకు పేదరిక విద్యావంతులు విగతజీవులు కావాల్సిందే.

గుమస్తా పనికోసం ఇంటర్వ్యూలో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి ఎక్కడా పొంతన ఉండదు. ఓ నిరుద్యోగి(కమల్ హాసన్) ప్రభుత్వం కార్యాలయం ఎక్కేమెట్టు దిగేమెట్టు తన భవిష్యత్తును ఏమాత్రం బంగారుమయం చేయకుండా అంధకారంలోకి నెట్టి వేస్తుంది. కమల్ హాసన్ స్నేహితురాలు శ్రీదేవి ఒకరోజు కమల్ హాసన్ గదికి వస్తుంది.కమల్ హాసన్ అతని స్నేహితులు అన్నంలేక ఆకలితో ఉన్నాకూడా వారు తింటున్నట్టుగా పక్కగదిలో నటిస్తూంటారు. వారు నటిస్తున్నారని తెలుసుకున్న శ్రీదేవి ఒక్కసారిగా అవాక్కవుతారు.

శ్రీదేవి తన డబ్బులతో వంట సామాగ్రి తీసుకువచ్చి వంట చేసి..తీరా వారికి అన్నం పెట్టే సమయానికి శ్రీదేవి నానమ్మ చని పోతుంది. అన్నం బుక్క నోట్లో పెట్టే సమయానికి ముసలమ్మ చనిపోవడం… వంటి హృదయ విదారకమైన ఈ సంఘటన చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు అంటూ ఎవరూ లేరనిపిస్తుంది.

మరో సన్నివేశంలో కమల్ హాసన్ తాను ఎంతగానో శ్రీశ్రీ సాహిత్యం ఇష్టపడుతూ ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే శ్రీ శ్రీ ని ఆదర్శంగా చేసుకుని తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటాడు. తినడానికి డబ్బులు లేకపోవడంతో చివరికి శ్రీశ్రీ రాసిన పుస్తకాలను అమ్ముకోవాల్సిన దుస్థితి ఆయనకు వస్తుంది. ఇలాంటి సన్నివేశాల్లో కమల్ హాసన్ కనబరిచిన నటన అసామాన్యం అనిపిస్తుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ నటనకు అదరహో… అనడం తప్ప మరొకటి ఉండదు. అయితే ఈ సినిమా విడుదలైన రెండు సంవత్సరాలకే శ్రీశ్రీ మరణించడం గమనార్హం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago