సినిమాలలో కొన్ని సీన్స్ చేసే సమయంలో నటీ నటులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఇబ్బందులు ఒక్కోసారి ప్రాణాల మీదకి తీసుకు వస్తుంటాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ చేసే సమయంలో హీరోలకి కాళ్ళు, చేతులు విరిగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. డాన్స్ చేస్తున్నప్పుడు కూడా జూనియర్ ఎన్.టి.ఆర్ అలాగే మెగాస్టార్ చిరంజీవి, ఇతర హీరోలకి కాళ్లు, చేతులు బెణికిన, విరిగిన సందర్భాలున్నాయి. కొన్ని కష్టతరమైన సన్నివేశాలలో ఒళ్ళు హూనం కూడా చేసుకుంటారు. ఇదంతా కూడా ప్రేక్షకులను మెప్పించేందుకే.
ఇక హీరోయిన్స్ కూడా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ చేయాల్సి వచ్చినపుడు కథ, అందులో పాత్రకి ఎంత అవసరమైతే అంతా చేయాల్సిందే. లేదంటే ఆ పాత్ర పండదు. అందుకే హీరోయిన్స్ ఎవరైనా దర్శకుడు చెప్పినట్టు సన్నివేశాలు చేయాల్సిందే. రొమాంటిక్ సీన్స్, ముద్దు సన్నివేశాలలో నటించే సమయంలో హీరోయిన్స్ బాగా ఇబ్బందులు పడుతుంటారు. దాదాపు 300 వందల మంది చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నా కూడా కొన్ని శృంగార సన్నివేశాలలో, ముద్దుల సన్నివేశాలలో నటించాల్సి వస్తుంది. త్వరగా అయిపోవాల్సిన సీన్ కూడా మొహమాటం, బెరుకు కారాణంగా ఎక్కువ టేకులు తీసుకుంటుంటారు. ఎన్ని టేకులు తీసుకున్నామనేది ముఖ్యం కాదు.
దర్శకుడు అనుకున్నట్టు సీన్ వచ్చిందా, అది ప్రేక్షకులను మెప్పిస్తుందా అనేదే ఇక్కడ ముఖ్యం. ఎవరైనా దానికోసమే కష్టపడుతుంటారు. అయితే సినిమా షూటింగ్ సమయంలో ఎంత కష్టపడినా కూడా ఆ తర్వాత సినిమాను తెర మీద చూసుకున్నప్పుడు కలిగే ఆనందం వెల కట్టలేనిది. ఇక వీటిని జీవితాంతం కూడా గుర్తు పెట్టుకుంటారు. ఏదైనా సందర్భం వచ్చినపుడు ఈ సంఘటలను గుర్తు చేసుకొని నవ్వుకుంటుండటం సహజం. అలాంటి ఓ సరదా సంఘటనని నట కిరీటి డా. రాజేంద్రప్రసాద్ ఆ మధ్య ఓ టీవీ కార్యక్రమంలో పంచుకున్నారు. అంతేకాదు ఈ సంఘటనను, ఆ సినిమాను ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు.
అదేంటంటే రాజేంద్రప్రసాద్ నటించిన మేడమ్ సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటన. ఇందులో సినిమాలో ఎక్కువ భాగం రాజేంద్రప్రసాద్ లేడీ గెటప్‌లోనే కనిపిస్తారు. అయితే ఈ సినిమా కథ విన్నప్పుడు చాలా ఈజీగా చేయొచ్చనుకున్నాను. కానీ ఒక మగాడు లేడీ గెటప్‌లో నటించడం ఎంత కష్టమో మేడం సినిమాతోనే అర్థమైంది అన్నారు. 1994లో వచ్చిన మేడమ్ సినిమాలో సౌందర్య హీరోయిన్‌గా నటించారు. మహిళగా నటించి మెప్పించిన రాజేంద్రప్రసాద్ 1994 లో నంది ప్రత్యేక జ్యూరీ అవార్డు కూడా అందుకున్నారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాను విజయ చాముండేశ్వరి ఫిల్మ్స్ పతాకంపై స్వయంగా రాజేంద్రప్రసాద్ నిర్మించారు.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే మేడమ్ సినిమాలో లేడీ గెటప్‌లో ఉన్న రాజేంద్ర ప్రసాద్ కబడ్డీ ఆడే సీన్ ఒకటి ఉంటుంది. ఆయన కూతకి వెళ్ళిన ప్రతీసారి జాకెట్ చిరిగి పోవడమో, కుట్లు ఊడిపోవడమో జరిగేదట. అలా దాదాపు 20 సార్లు చిరిగితే, కాస్ట్యూంస్ వారు 20 సార్లు మళ్ళీ కుట్టారట. ఇది తన లైఫ్‌లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ అని ఇటీవల రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఇదే కాదు ఇలాంటి సంఘటనలు ఆయన కెరీర్‌లో చాలాసార్లు జరిగాయట. ఇక హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చక్కటి పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…