“అంతరంగాలు అనంత మానస చదరంగాలు.. అంతే ఎరగని ఆలోచనల సాగరాలు.. “1990 చివరి దశకంలో బుల్లితెరలో దారా వాహికంగా వచ్చిన అంతరంగాలు సీరియల్ లోని ఈ పాట తెలుగు ప్రజలను ఒక ఊపు ఊపేసింది. ఈ పాట గుర్తుంటే అంతరంగాలు సీరియల్ లో నటించిన అచ్యుత్ కూడా మనకు గుర్తుంటాడు. ఈటీవీలో హిట్టయిన సీరియల్స్ లో అంతరంగాలు దారావహికం ఒకటి. ఇందులో అతని నటన మహిళా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇలాంటి సీరియల్స్ మళ్లీ రావాలని మహిళా అభిమానులు కోరుకునే లోపే నటుడు అచ్యుత్ పరమపదించడం మహిళా ప్రేక్షకులకు తీవ్ర ఆవేదన కలిగించింది.
1964 లో కృష్ణాజిల్లా మచిలీపట్నంలో రామారావు సుజాత దంపతులకు అచ్యుత్ జన్మించారు. డిగ్రీ చదువుతున్న క్రమంలోనే అచ్యుత్ నాటకరంగంపై ఎక్కువ ఇష్టాన్ని చూపేవాడు. 1980 ప్రారంభదశలో అచ్యుత్ హైదరాబాద్ వచ్చి అక్కడ మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో రెండు సంవత్సరాలు నటనలో శిక్షణ తీసుకున్నాడు. అలా 1986లో దూరదర్శన్ లో ప్రసారమైన ఇంద్రధనస్సు సీరియల్ లో మొదటగా నటించాడు. ఆ తర్వాత వెన్నెల వేట, ప్రేమంటే ఇదే 1988లో మిస్టర్ బ్రహ్మానందం లాంటి సీరియల్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత బేబీ దర్శకత్వంలో వచ్చిన ఆదివారం అమావాస్య హారర్ మూవీ తో అచ్యుత్ వెండితెరపై కనిపించాడు.
ఈ సినిమాలో అచ్యుత్,జయ రేఖ హీరో,హీరోయిన్లుగా నటించారు. సోమయాజులు ప్రధాన పాత్ర పోషించారు. 1991లో జంధ్యాల దర్శకత్వంలో ప్రేమ ఎంత మధురం, ఆ తర్వాత సుమన్ హీరోగా నటించిన పట్టుదల చిత్రంలో అచ్యుత్ నటించారు. రాజశేఖర్, సుకన్య హీరోహీరోయిన్లుగా నటించిన ‘అమ్మ కొడుకు’ చిత్రంలో అచ్యుత్ ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తమ్ముడు చిత్రంలో ఆయనకు అన్నగా నటించాడు. చిరంజీవి సినిమాలు చూసి చిత్ర రంగంలోకి అడుగుపెట్టిన అచ్యుత్ కు ఆయనతో నటించలేదని అనుకుంటున్న సమయంలో 2001 సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన డాడీ అనే చిత్రంలో అచ్యుత్ ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది. చిరంజీవి అభిమానిగా ఆయనతో నటించడం అచ్యుత్ కి ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. కానీ అదే సమయంలో సినీ ప్రముఖులు కొంతమంది బిజినెస్ చేసి లాభాలు పొందడం చూసి తాను కూడా ఏదో ఒక వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నారు.
ఆ క్రమంలో దాదాపు 40 లక్షల రూపాయలు అప్పు చేసి వినయ్ ప్రింటింగ్ ప్రెస్ ని తన స్నేహితులతో ప్రారంభించాడు. ఆయన సినిమాల్లో బిజీగా ఉండడంతో స్నేహితులకు వ్యాపారం అప్పగించడం వలన అందులో చాలా నష్టాలు వచ్చాయి. ఆయన చేసిన అప్పు గురించి ఆలోచిస్తు.. ఒకరోజు అత్యంత చల్లని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో… చాతిలో నొప్పి రావడంతో అది గుండెపోటు అని గ్రహించే లోపే అచ్యుత్ మరణించాడు. వెండితెర, బుల్లితెర సినీ ప్రముఖులు,అభిమానులు ఆయన మరణానికి కన్నీటి పర్యంతమయ్యారు. హిమబిందు, మిస్టర్ బ్రహ్మానందం సీరియల్ లో నటించినందుకు ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. 1990 లో ఆయన నటనకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నంది అవార్డును ఇచ్చింది. ఆయనకు సుజాత, శివాని అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వెండితెర కంటే బుల్లితెర పైనే అశేష అభిమానులను అచ్యుత్ సంపాదించుకున్నారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…