సినిమా విజయవంతం అవడంలో కథ ప్రధానపాత్ర పోషిస్తే.. ఆ చిత్రానికి తగిన టైటిల్ లేకపోతే సినిమా ప్రజల్లోకి అంత తొందరగా వెళ్లలేదు.అభిమాన హీరో, అభిమాన హీరోయిన్ ఉంటేనే సరిపోదు దానికి తగినటువంటి టైటిల్ ఉన్నప్పుడే ఆ సినిమా విజయవంతం అవుతుందని చెప్పవచ్చు. అయితే సినిమా టైటిల్ నిర్ణయించడంలో.. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. ఆ విధంగా తమ ఒంటి పేరే సినిమా పేరుగా వచ్చిన ఇద్దరు స్టార్ హీరోల చిత్రాలున్నాయి.
1980 దశకంలో వచ్చిన హీరోలు చిరంజీవి, నాగార్జున చిత్రాలు ఉన్నాయి. మనఊరి పాండవులు, న్యాయం కావాలి, ఖైదీ లాంటి విజయవంతమైన చిత్రాలతో దూసుకు వెళ్తున్న సుప్రీం హీరో చిరంజీవి. 1985, అజయ్ క్రియేషన్స్, సి.వీ రాజేంద్రన్ దర్శకత్వంలో ‘చిరంజీవి’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించారు. చక్రవర్తి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన ఈ చిత్రం మంచి అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.
1986 అక్కినేని నాగేశ్వరరావు తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తూ అన్నపూర్ణ బ్యానర్, వి.మధుసూదనరావు దర్శకత్వంలో విక్రమ్ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో నాగార్జున, శోభన హీరో హీరోయిన్లుగా నటించారు. నాగార్జునకు మొదటి సినిమానే పరాజయాన్ని చవిచూసింది. ఆ తరువాత జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ లో అక్కినేని నాగేశ్వరరావుతో చాలా విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. 1986 జగపతి ఆర్ట్ పిక్చర్స్, వి.బి.రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో ‘కెప్టెన్ నాగార్జున్’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో నాగార్జున, కుష్బూ హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటించారు.
నాగార్జున తన సినీ కెరీర్లో విమాన పైలెట్ గా నటించిన ఒకే ఒక చిత్రం ‘కెప్టెన్ నాగార్జున్’. మొదటిసారి నాగార్జున, ఖుష్బూ కలిసి నటించిన ‘కెప్టెన్ నాగార్జున్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. మెగాస్టార్ చిరంజీవి, యువసామ్రాట్ నాగార్జున తమ ఒంటి పేరే సినిమా పేరుగా వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…