షూటింగ్ విరామంలో సాయంత్రం పూట ఇంటికి ఫోన్ చేస్తే ఎడిటర్ మోహన్ గారు మీకోసం వచ్చారని చెప్పడంతో.. ఆయన తర్వాత ఎడిటర్ మోహన్ ఇంటికి వెళ్లి కలవడం జరిగింది. అప్పుడు ఎడిటర్ మోహన్ ముత్యాల సుబ్బయ్యను తీసుకెళ్లి మమ్ముట్టి నటించిన ఓ మలయాళం సినిమాని చూపించడం జరిగింది.
అప్పుడు ముత్యాల సుబ్బయ్య సినిమా చాలా బాగుందని చెప్పడంతో ఇది తెలుగులో ఎవరితో తీస్తే బాగుంటుందని అడగగా చిరంజీవి లాంటి స్టార్ తో తీస్తే బాగుంటుందని ముత్యాల సుబ్బయ్య చెప్పారు. సరిగ్గా నేను కూడా చిరంజీవి గారు అయితేనే బాగుంటుందనుకున్నాను. ఇక ఆలస్యం చేయకుండా ఇద్దరూ చిరంజీవిని కలవడం జరిగింది.
అయితే అప్పటికే పవిత్ర బంధం లాంటి కుటుంబ కథా చిత్రాన్ని తీసిన ముత్యాల సుబ్బయ్య సెంటిమెంటుతో ప్రేక్షకుల కన్నీళ్ళకు ఆయింట్మెంట్ రాసే దర్శకుడిగా ఆయనకు మంచి పేరు ఉండటంతో ఎడిటర్ మోహన్ దర్శకుడిగా ముత్యాల సుబ్బయ్య ను ఎంచుకోవడం జరిగింది. అప్పటికి చిరంజీవి, రాధిక నటించిన ‘ఇది పెళ్లంటారా’ అనే సినిమాకి కో-డైరెక్టర్ గా మాత్రమే చేసిన ముత్యాల సుబ్బయ్యకు ఎప్పటినుంచో చిరంజీవితో సినిమా తీయాలనేది కోరికగానే ఉండిపోతుందా.. అనుకునే సమయంలో చిరంజీవితో ‘హిట్లర్’ సినిమా చేసే అవకాశం వచ్చింది.
రిక్షావోడు, బిగ్ బాస్, ఎస్పి.పరశురాం లాంటి పరాజయాలతో చిరంజీవి దాదాపు మూడు సంవత్సరాలు హిట్ సినిమా లేక సతమతమవుతున్న తరుణంలో ముత్యాల సుబ్బయ్య చిరంజీవికి ఓ సూపర్ హిట్ సినిమాను అందించారు. సినిమాలో కేవలం సెంటిమెంట్ మాత్రమే కాకుండా కామెడీ, అంతకుమించి చిరంజీవి ప్రత్యేకమైన పాటలు, డాన్సులు అభిమానులకు ఎడారిలో బిస్లరీ బాటిల్ దొరికినట్టుగా ఫీల్ అయ్యారు. మూడు సంవత్సరాలకు ఓ విజయవంతమైన సినిమాతో చిరంజీవి ఊపిరిపీల్చుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…