గత కొంత కాలంగా నాగచైతన్య, సమంత మధ్య చిన్నపాటి గొడవలతో విడిపోతున్నారన్న వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అవి ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. చైతు మాత్రం తన లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి ప్రమోషన్లు మాత్రం బాగానే చేస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజు క్రితం లవ్ స్టోరీ ట్రైలర్ విడుదల చేసిన చిత్ర బృందం.. సెప్టెంబర్ 19న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు.
తర్వాత వెటనే అంటే సెప్టెంబర్ 24 న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసుందుకు ప్రణాళికతో ఉన్నారు. అయితే ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచేందుకు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. నాగార్జునకు చిరంజీవి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కూడా నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి పలు ఈవెంట్లకు హాజరయ్యారు చిరంజీవి. మరోసారి నాగచైతన్య హరోగా నటించిన లవ్ స్టోరీ ఫిలిం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు రానున్నారు.
ఇదిలా ఉండగా ముందుగా ఈ ఈవెంట్ ను మొదట 17 సెప్టెంబర్ అనుకున్నారట.. కానీ చిరంజీవికి ఆరోజు కుదరకపోవడంతో 19 తేదీకీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో చిరంజీవి, నాగార్జున ఇద్దరు కనిపించబోతున్నారు. ఈ సినిమా విషయానికి వస్తే సినిమాకు సంగీతం వహించిన పవన్ అద్భుతమైన బాణీలను అందించారు. ఇప్పటికే ఈ పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
నాలుగు పాటలు అయితే ఇప్పటికీ యూట్యూబ్ లో ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటున్నాయి.
ఫిదా లాంటి సూపర్ హిట్ కొట్టిన తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా కావడంతో పాటు మొన్న విడుదలైన ట్రైలర్ కూడా సినిమా మీద ఆసక్తి పెంచేసింది. మరి చూడాలి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…