Featured

దేవీశ్రీ ప్రసాద్‌ని హీరో చేస్తామన్న నిర్మాతలు.. ఇప్పుడెంత ఘోరంగా మాట్లాడుతున్నారో పాపం..?

టాలీవుడ్‌లో రాక్ స్టార్ గా దేవీశ్రీ ప్రసాద్ కి ఉన్న క్రేజ్ ఏంతటిదో అందరికీ తెలిసిందే. ఆయన మేనరిజానికి తగ్గట్టే రాక్ స్టార్ అని అందరు పిలుచుకుంటున్నారంటే తన బాడీలో ఎన్నివేల వాట్స్ ఎనర్జీ ఉందో అర్థం చేసుకోవచ్చు. దేవి సినిమాతో సంగీత దర్శకుడిగా మారిన దేవీ అతి కొద్దికాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. చిన్న సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి లాంటి అగ్ర హీరోల వరకు రాక్ స్టార్ మ్యూజిక్ అందించాడు..అందిస్తున్నాడు. దేవీశ్రీప్రసాద్ ప్రముఖ సినిమా రచయిత సత్య మూర్తి కొడుకు అనే విషయం తెలిసిందే. ఆయన 90కిపైగా చిత్రాలకు రచయితగా, నాలుగు వందల సినిమాలకు పైగా మాటలు అందించారు.

అలా ఇంట్లో సినిమా వాతావరణం ఉన్న కారణంగా దేవీశ్రీ ప్రసాద్ కి చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి కలిగింది. తండ్రికి ఇండస్ట్రీ వర్గాల వారితో ఉన్న పరిచయాల కారణంగా ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ వద్ద కొంత కాలం కీ బోర్డ్ ప్లేయర్ గా పనిచేశాడు. థమన్, దేవీశ్రీ ఒకే బ్యాచ్. సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన కొన్నేళ్ళకే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పాపులారిటీ సాధించాడు. డీఎస్పీ గా, రాక్ స్టార్ గా ఆయనకి ఇండస్ట్రీ వర్గాలలో, హీరోలలో, అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.

దేవీశ్రీప్రసాద్ సంగీతం అంటే ఖచ్చితంగా ఆ సినిమా ఆల్బం హిట్ అనే నమ్మకం అందరిలోనూ కలిగించాడు. అంతేకాదు సినిమా ప్రమోషన్స్‌లో ప్రధాన పాత్ర పోషించి రిలీజ్ కి ముందే భారీ స్థాయిలో అంచనాలు పెంచేస్తారు. అలా ఎన్నో సినిమాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, ఆడియో ఫంక్షన్స్ లోనే సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసి హిట్ అవడంలో ముఖ్య పాత్ర పోషించారు. మెగాస్టార్ తో కూడా ఆడియో ఫంక్షన్స్ లో స్టేజ్ మీద స్టెప్పులేయించిన ఘనత దేవీది. ఇటు తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా దేవీశ్రీ ప్రసాద్ తన సత్తా చాటుతున్నారు.

కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్య నటించిన సింగం సిరీస్ తో పాటు పలు హిట్ సినిమాలకి అలాగే విక్రం లాంటి స్టార్ హీరోల సినిమాలకి సంగీతం అందించి హిట్స్ ఇచ్చాడు. దేవీశ్రీ పాటంటంటే 60 ఏళ్ళ ముసలి వాళ్ళకైనా ఊపొచ్చేయాల్సిందే.. ఎగిరి గంతులేయాల్సిందే. అంత హుషారుగా ఉండే దేవీశ్రీప్రసాద్ చాలా స్టైలిష్‌గాను కనిపిస్తాడు. ఫంక్షన్స్ లో దేవీ కనిపించే విధానం ఓ హీరో రేంజ్ లో ఉంటుంది. చెప్పాలంటే హీరో అని అన్న అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. డీఎస్పీ డాన్స్ కూడా బాగా చేస్తాడు. అందుకే ఆయనను హీరోగా పెట్టి సినిమా తీయాలని గతంలో చాలామంది దర్శక, నిర్మాతలు అనుకున్నారు.

దీనికి సంబంధించి అప్పట్లో చాలా రకాల వార్తలు వచ్చాయి. దేవీశ్రీప్రసాద్ హీరోయిపోతున్నాడని ఇకపై మ్యూజిక్ డైరెక్టర్‌గా వర్క్ చేయడేమో అనే ప్రచారం కూడా జరిగింది. అయితే నిజంగానే దేవీశ్రీప్రసాద్ హీరోగా ఓ ప్రాజెక్ట్ మొదలై ఆగిపోయిందని చెప్పుకున్నారు. ఇలా ఆగిపోవడానికి కారణం హీరోగా సూటవవనే మాటలు ఇండస్ట్రీలోని చాలామంది సలహా ఇచ్చారట. హీరోగా చేసి ఒకవేళ సక్సెస్ కాకపోతే ఆ ఎఫెక్ట్ మ్యూజిక్ కెరీర్ మీద పడుతుందని భావించారట. పొరపాటున హీరోగా దేవీని ఆడియన్స్ రిసీవ్
చేసుకోలేకపోతే అన్నీ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిర్మాతలు రిస్క్ చేయడం ఇష్టం లేక దేవీతో అనుకున్న ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేశారట.

ఇక గత కొంతకాలంగా ఆయన అంచనాలకి తగ్గట్టు సత్తా చాట లేకపోతున్నాడు. ప్రస్తుతం హవా మొత్తం థమన్‌దే నడుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే థమన్ దెబ్బకి దేవీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడనే చెప్పాలి. అందుకే ఇప్పుడు ఆయన దృష్టి మళ్ళీ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకోవడం మీదే పెట్టాడు. ఇకపై కూడా హీరో ప్రయత్నాలు చేయనట్టే అని చెప్పుకుంటున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago