కొంతమంది వాస్తును చాలావరకు నమ్ముతారు. దాని ప్రకారమే వాళ్ల జీవన గమనాన్ని కూడా సాగిస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి పుడుకునే వరకు వాళ్ల రాశి ఎలా ఉంటుందో కూడా చూసుకుంటారు. దానిలో ఏదైనా.. ఆ పనిచేయవద్దు అని రాసి ఉంటే.. ఆ పనికి దూరంగా ఉంటారు. ఇలా జ్యోతిష్య శాస్త్రాన్ని కూడా నమ్మేవాళ్లు మన ఇండియాలో చాలామందే ఉన్నారు.
అయితే ఎవరైనా.. ఏం చేసినా డబ్బుల కోసమే. ఇంట్లోకి సంపాదన ఎక్కువగా రావాలంటే.. జ్యోతిష్యులు ఇంట్లో కొన్ని వస్తువులను మార్చాలంటూ చెబుతుంటారు. వాటి స్థానంలో మార్పు చేస్తే సరిపోతుందంటూ చెబుతారు. కొన్ని సందర్భాలలో ఇంటిని కూల్చేసి మళ్లీ కట్టాలని కూడా సలహా ఇస్తుంటారు. ఇలా ఇంటి రూపరేఖలను కూడా మార్చేస్తారు కొంతమంది.
మంచి జరుగుతుందంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. అయితే చాలామంది డబ్బులను, నగలను చాలా వరకు బీరువాలోనే దాచుకుంటారు. ఇలా లక్ష్మీదేవి ఉండే బీరువా పై ఎలాంటి బరువు కలిగిన వస్తువుల పెట్టకూడదట. దీనికి కారణం ఏంటంటే.. ఇలా బరువుగా పెడితే ఆ తల్లి ఆగ్రహించి ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
బీరువాకి అద్దం ఉండకూడదు. ఎందుకంటే.. ఆ అద్దం ముందు నిల్చొని అందంగా అలంకరించడం ఆ అమ్మకి ఇష్టం ఉండదట. ఇలా చేస్తే.. బీరువా ఖాళీ అయిపోతుందని పండితులు చెబుతున్నారు. అంటే అనవసరమై ఖర్చులు ఎక్కవ పెడతారని అర్థం. లాకర్లలో డబ్బులు దాచుకునే వారు ఇంట్లోని దక్షిణం, పశ్చిమం మధ్యలో ఉంటే నైరుతి వైపు ఆ లాకర్లను దాచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…