ఎన్టీఆర్ కు క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం. ఏ పని చేసినా పద్దతి ప్రకారం చేస్తారు. తొలినాళ్లలో కొన్ని చెడు వ్యసనాలకు అలవాటు పడినా.. ఆ తర్వాత వాటిని వదిలించుకున్నారు. సినిమా రంగంలోకి రాక ముందు ఆయన విజయవాడలో పొగాకు బిజినెస్ చేశారు. ఆ సమయంలో చుట్ట తాగడం బాగా అలవాటుగా మారింది. అయితే సినిమాల్లోకి వచ్చిన సమయంలోనూ ఆ అలవాటు కొనసాగించారు. ఆయన నటించిన మనదేశం సమయంలో ఆ చిత్ర దర్శకుడు ఎల్వీ ప్రసాద్ ఓ విషయం చెప్పారు.
సినిమా హీరోలకు పళ్లు తెల్లగా కనిపించాలన్నారు. అలా ఉండాలంటే చుట్ట కాల్చకూడదని చెప్పారు. ప్రసాద్ చెప్పిన మాటలు విని మళ్లీ చుట్ట జోలికి పోకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారట. దాంతో పాటు ఓ సారి ఊటీలో షూటింగ్ కు వెళ్లారట ఎన్టీఆర్. అక్కడ చలి ఎక్కువగా ఉండటంతో తెల్లవారు జామున బయటకు వచ్చి చుట్ట కాల్చారట. అదే సమయంలో తన చిన్న కొడుకు జయశంకర్ కృష్ణ అక్కడికి వచ్చి.. నాన్న మీరు చుట్ట తాగుతారా? అని అడిగాడట. దీంతో ఇక ఎప్పుడూ చుట్ట తాగకూడదని నిర్ణయం తీసుకున్నారట ఎన్టీఆర్.
అటు ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి సినిమా ‘పల్లెటూరి పిల్ల’. అందులో ఎద్దులతో పోరాట సన్నివేశం ఉంటుంది. అసలే ఆ ఎద్దు ఆస్ట్రేలియాకు చెందినది. జాగ్రత్తగా ఉండాలని డైరెక్టర్ సుబ్బారావు.. రామారావును హెచ్చరించారు. దాని కొమ్ములు పట్టుకుంటే చాలు మేం సీన్ ఓకే చేసుకుంటామని చెప్పారట. అయితే ఈ సీన్ లో నిజంగానే ఎద్దుతో పోరాడారు రామారావు. దీంతో ఆ ఎద్దు ఎన్టీఅర్ ను ఎత్తి కింద పడేసింది. ఆయన బరువంతా కుడిచేతి మీద పడింది. దీంతో ఆయనకు తీవ్రంగా నొప్పి అయ్యింది. అదే సమయంలో చిత్తూరు నాగయ్య గ్లాసులో పచ్చటి ద్రావణాన్ని తెచ్చి రామారావుకు ఇచ్చారట. ఇది తాగమని చెప్పారట. దీంతో నొప్పి తగ్గుతుందా? అని రామారావు అడిగారట. ఇది శరీర బాధలే కాదు.. మానసిక బాధలను సైతం తొలగిస్తుందనిచెప్పారట చిత్తూరు నాగయ్య.
అయితే నాగయ్య మాటలతో రామారావు నో చెప్పారు. నా చెయ్యే కాదు.. బాడీలో ఎముకలన్నీ విరిగినా.. ఈ మందు తీసుకోనన్నారట. మత్తుమందు తాగి జీవితాన్ని మరింత నొప్పిమయం చేసుకోలేను అని చెప్పారట. ఆయన మాటలకు నాగయ్య సంతోషం వ్యక్తిం చేశారట. జీవితంలో మరింత పైకి వస్తావని ఆశీర్వదించారు. వెంటనే వైద్యుడిని పిలిపించి చేతికి కట్టుకట్టించారు. మరుసటి రోజు ఆయన షూటింగ్ కు యథావిధిగా హాజరయ్యాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…