కెజిఎఫ్ సినిమా తో దేశ వ్యాప్త గుర్తిపు తెచ్చుకున్నాడు యష్..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసుకుడు. ఈ సినిమా తో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకునేలా చేశాడనడం లో ఎలాంటి సందేహం లేదు. కేజీఎఫ్ సినిమాతో రాత్రికి రాత్రే సూపర్ క్రేజ్ సంపాదించిన కన్నడ రాక్‌స్టార్ యశ్ దంపతులు తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ శుక్రవారం అయన సతీసమేతంగా నూతన ఇంటికి గృహ ప్రవేశం చేసారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యశ్ బెంగుళూరు నగరంలోని అత్యంత ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్ మెంట్‌లో ఒక ఇంటిని తాజగా కొనుగోలు చేసారు. ఈ నేపధ్యంలో అయన భార్య రాధికా పండిత్‌తో కలిసి శుక్రవారం నాడు గృహ ప్రవేశం చేశాడు. ఈ క్రమంలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నూతన గృహ ప్రవేశానికి యశ్ కుటుంబ సభ్యులతో పాటూ.. కొద్ది మంది బంధువులు హాజరైనట్టు తెలుస్తుంది.
ఇటీవలే కర్నాటక శివారు ప్రాంతంలో యశ్ ఫామ్ హౌజ్‌ని నిర్మించిన విషయం తెలిసిందే.. ఇక ఇప్పుడు కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఇదంతా కేజీఎఫ్ సినిమా సృష్టించిన ప్రభంజనం వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఒక్కసారిగా దేశాన్ని ఊపేసింది కేజీఎఫ్ సినిమా.. కేజిఎఫ్ సినిమా వచ్చె అంతవరకు కన్నడ సినీ పరిశ్రమను కుటీర పరిశ్రమగా భావించేవారు సినీ లోకం. అక్కడి సినిమాలు బాగున్నా బడ్జెట్ లు తక్కువ కావడంతో అక్కడి సినిమా లపై ఎవరు అంతగా ఆసక్తి చూపేవారు కాదు.. కానీ కేజిఎఫ్ సినిమా వచ్చిన తరువాత కన్నడ సినిమాలపై అందరి దృష్టిపడింది.. ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్- 2లో నటిస్తున్నారు యశ్, కరోనా నేపధ్యంలో ఆలస్యం అయిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్నా ఈ సినిమా కన్నడ, తెలుగుతో పాటు తమిళం, హిందీలోనూ విడుదల చేస్తున్నారు.
కొత్తింట్లోకి అడుగుపెట్టిన కేజీఎఫ్ స్టార్ యశ్..!
కొత్తింట్లోకి అడుగుపెట్టిన కేజీఎఫ్ స్టార్ యశ్..!
కొత్తింట్లోకి అడుగుపెట్టిన కేజీఎఫ్ స్టార్ యశ్..!
కొత్తింట్లోకి అడుగుపెట్టిన కేజీఎఫ్ స్టార్ యశ్..!
కొత్తింట్లోకి అడుగుపెట్టిన కేజీఎఫ్ స్టార్ యశ్..!
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…