ఎన్టీఆర్ కు క్రమశిక్షణ అంటే ఎంతో ఇష్టం. ఏ పని చేసినా పద్దతి ప్రకారం చేస్తారు. తొలినాళ్లలో కొన్ని చెడు వ్యసనాలకు అలవాటు పడినా.. ఆ తర్వాత వాటిని వదిలించుకున్నారు. సినిమా రంగంలోకి రాక ముందు ఆయన విజయవాడలో పొగాకు బిజినెస్ చేశారు. ఆ సమయంలో చుట్ట తాగడం బాగా అలవాటుగా మారింది. అయితే సినిమాల్లోకి వచ్చిన సమయంలోనూ ఆ అలవాటు కొనసాగించారు. ఆయన నటించిన మనదేశం సమయంలో ఆ చిత్ర దర్శకుడు ఎల్వీ ప్రసాద్ ఓ విషయం చెప్పారు.
సినిమా హీరోలకు పళ్లు తెల్లగా కనిపించాలన్నారు. అలా ఉండాలంటే చుట్ట కాల్చకూడదని చెప్పారు. ప్రసాద్ చెప్పిన మాటలు విని మళ్లీ చుట్ట జోలికి పోకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారట. దాంతో పాటు ఓ సారి ఊటీలో షూటింగ్ కు వెళ్లారట ఎన్టీఆర్. అక్కడ చలి ఎక్కువగా ఉండటంతో తెల్లవారు జామున బయటకు వచ్చి చుట్ట కాల్చారట. అదే సమయంలో తన చిన్న కొడుకు జయశంకర్ కృష్ణ అక్కడికి వచ్చి.. నాన్న మీరు చుట్ట తాగుతారా? అని అడిగాడట. దీంతో ఇక ఎప్పుడూ చుట్ట తాగకూడదని నిర్ణయం తీసుకున్నారట ఎన్టీఆర్.
అటు ఎన్టీఆర్ హీరోగా నటించిన తొలి సినిమా ‘పల్లెటూరి పిల్ల’. అందులో ఎద్దులతో పోరాట సన్నివేశం ఉంటుంది. అసలే ఆ ఎద్దు ఆస్ట్రేలియాకు చెందినది. జాగ్రత్తగా ఉండాలని డైరెక్టర్ సుబ్బారావు.. రామారావును హెచ్చరించారు. దాని కొమ్ములు పట్టుకుంటే చాలు మేం సీన్ ఓకే చేసుకుంటామని చెప్పారట. అయితే ఈ సీన్ లో నిజంగానే ఎద్దుతో పోరాడారు రామారావు. దీంతో ఆ ఎద్దు ఎన్టీఅర్ ను ఎత్తి కింద పడేసింది. ఆయన బరువంతా కుడిచేతి మీద పడింది. దీంతో ఆయన కుడిచేతి ఎముక విరిగిపోయింది. ఆనోప్పితో ఆయన బాధపడుతుంటే.. ఆ బాధ చూడలేక చిత్తూరు నాగయ్య గ్లాసులో పచ్చటి ద్రావణాన్ని తెచ్చి రామారావుకు ఇచ్చారట. ఇది తాగమని చెప్పారట. దీంతో నొప్పి తగ్గుతుందా? అని రామారావు అడిగారట. ఇది శరీర బాధలే కాదు.. మానసిక బాధలను సైతం తొలగిస్తుందనిచెప్పారట చిత్తూరు నాగయ్య.
అయితే నాగయ్య మాటలతో రామారావు నో చెప్పారు. నా చెయ్యే కాదు.. బాడీలో ఎముకలన్నీ విరిగినా.. ఈ మందు తీసుకోనన్నారట. మత్తుమందు తాగి జీవితాన్ని మరింత నొప్పిమయం చేసుకోలేను అని చెప్పారట. ఆయన మాటలకు నాగయ్య సంతోషం వ్యక్తిం చేశారట. జీవితంలో మరింత పైకి వస్తావని ఆశీర్వదించారు. వెంటనే వైద్యుడిని పిలిపించి చేతికి కట్టుకట్టించారు. మరుసటి రోజు ఆయన షూటింగ్ కు యథావిధిగా హాజరయ్యాడు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…