కొంతమందిని చూస్తే ఇతను నటుడా.. అనే సందేహం కలగక మానదు. కానీ అతనే మొహానికి రంగేసుకున్నా.. ఒక్కసారి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడంటే ఆ పాత్ర కామెడి, విలన్.. ఇలా ఎటివంటి పాత్ర అయినా విజృంభనే. అలాంటి గొప్ప నటులలో ఒకరు రాళ్ళపల్లి. ఆయన పోషించిన చాలా పాత్రలకి ప్రాణం పోశారు. ఆయన తూర్పు గోదావరి జిల్లా, రాచపల్లిలో ఆగస్టు 15 1945లో పుట్టారు. బీకామ్ పూర్తి చేసిన రాళ్ళపల్లికి టెన్త్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్‌తోనే రైల్వేలో క్లాస్ ఫోర్ జాబ్ అంటే ప్యూన్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత 1970 ప్రారంభంలో ఢిల్లీలోని ‘సాంగ్ అండ్ డ్రామా డివిజన్’ అనే ప్రభుత్వ సంస్థలోకి మారారు.
అప్పట్లో దాదాపు వెండితెర మీద వెలిగిన నటులలో ఎక్కువ శాతం నాటరంగంలో గొప్ప అనుభవం సంపాదించి వచ్చిన వారే. ఆ కోవలోనే రాళ్ళపల్లి కూడా వస్తారు. ఆయన కూడా పలు నాటకాలు వేసి గుర్తింపు తెచ్చుకొని సినిమా రంగంలో అడుగుపెట్టారు. రాళ్ళపల్లికి విపరీతంగా పేరు తెచ్చిన నాటకం కన్యాశుల్కం. ఆయన చదువుకునే రోజుల్లోనే కాలేజీలో పోటీలు నిర్వహించారు. ఇందుకోసం రాళ్ళపల్లి ‘మారని సంసారం’ అనే నాటిక ఒకటి రాశారు. దీనికి రచన, నటన రెండు విభాగాలలోను అవార్డులు
దక్కాయి.
ప్రముఖ సినీనటి భానుమతి రామకృష్ణ చేతుల మీదుగా రాళ్ళపల్లి ఆ అవార్డులు అందుకున్నారు. నాటకమంటే ప్రాణమిచ్చే రాళ్ళపల్లి, అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రిహార్సల్ మొదలుపెట్టేవారు. ఆయన వేసే నాటకాలు సినిమా స్థాయిలో ఉండేవంటే నమ్మి తీరాల్సిందే. అంతేకాదు నాటకాల కోసం ఖర్చంతా ఆయనే పెట్టుకునేవారు. కొన్ని సందర్భాలలో తప్పని పరిస్థితుల్లో నాటకం కోసం అప్పులు కూడా చేశారు. అప్పుల నేపథ్యంలోనే ‘ముగింపు లేని కథ’ అనే నాటకం రాసి, దాదాపు వందకు పైగా ఆ నాటకాలను ప్రదర్శించి, వేసిన ప్రతిసారీ ‘ఉత్తమ నాటకం’ అనిపించుకునేలా రూపొందించారు.
నాటక రంగంలో అంత సుధీర్ఘ అనుభవం సంపాదించిన రాళ్ళపల్లి తన భార్య సహకారంతో సినిమాలలోకి వచ్చారని చెప్పాలి. ప్రముఖ నవల ఆధారంగా సినిమా తీస్తున్నట్లు పత్రికలో ఓ ప్రకటన చూసిన రాళ్ళపల్లి భార్య సినిమాలపై ఆయనకున్న ఆసక్తిని దృష్ఠిలో పెట్టుకొని దరఖాస్తు చేయమని సపోర్ట్ చేశారు. “చూడ్డానికి అందగాడిని కాకపోయినా నాకు నాటకాల్లో అనుభవం ఉంది. పనికొస్తే చూడండి” వినూత్నంగా అంటూ దరఖాస్తు పెట్టారు రాళ్ళపల్లి. అది చూసిన దర్శక, నిర్మాతలు ఆయనని ఇంటర్వ్యూకు పిలిచారు. సినిమాకు మాటల రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రి, పాటల రచయిత సినారె సమక్షంలో ఒక సీన్ కెమెరా ముందు నటించి చూపించి ‘ఊరుమ్మడి బతుకులు’ అనే సినిమాలో అవకాశం దక్కించుకున్నారు.
అయితే దీనికంటే ముందే రాళ్ళపల్లి 1973లో ‘స్త్రీ’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 1977లో నటించిన ‘ఊరుమ్మడి బతుకులు’ పాపులారిటీ సాధించి కెరీర్‌లో వెనక్కి తిరిగి చూడలేదు. ముఖ్యంగా ఆయనలోని కమెడియన్ ని బయటకి తీసుకు వచ్చిన దర్శకులు, జంధ్యాల, వంశీ. వీరి దర్శకత్వంలో వచ్చిన దాదాపు అన్నీ సినిమాలలో రాళ్ళపల్లికి ఓ పాత్ర ప్రాణం పోసుకునేది. ఆయనను నమ్మి దర్శకులు సృష్ఠించిన పాత్రలకి నిజంగానే ప్రాణం పోయడానికి తన శాయశక్తులా తాపత్రయపడేవారు. మణిరత్నం ‘బొంబాయి’ సినిమాలో హిజ్రాగా నటించి సౌత్ సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 15న కళాకారుల్లో ఒకరికి సన్మానం చేసి 50వేల రూపాయలు ఇచ్చేవారంటే కళల పట్ల, కళాకారుల పట్ల ఆయనకి ఉన్న గౌరవం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో అద్భుతమైన పాత్రలతో దాదాపు 850 కి పైగా చిత్రాలలో నటించిన రాళ్ళపల్లి చివరిగా నాని – మారుతి కాంబినేషన్‌లో వచ్చి సూపర్ హిట్ అయిన ‘భలే భలే మగాడివోయ్’ అనే చిత్రంలో నటించారు.
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…