Movie News

చెన్నై వెళ్ళిన ప్రతీసారి ఖచ్చితంగా షకీలా ఇంటికెళ్ళే టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఎవరో తెలిస్తే షాకవుతారు

షకీలా..మలయళా సినిమా ఇండస్ట్రీని మాత్రమే కాదు మిగతా ఇండస్ట్రీలని తన సినిమాలతో ఒక ఊపు ఊపేసిన శృంగార తార. స్టార్ హీరో కి స్టార్ హీరో ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా పోటీ ఉండటం సహజం. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగితే ఉండే ఉత్కంఠతే వేరు. ఇది సౌత్ భాషలోని సినిమాల పరంగా అయినా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోని సినిమాల పరంగా అయినా ఉండే పోటీనే. ముఖ్యంగా సంక్రాంతి, దసరా, దీపావళి, రంజాన్, క్రిస్‌మస్, సమ్మర్ లాంటి స్పెషల్ సీజన్స్ అయితే బాక్సాఫీస్ వద్ద ఉండే ఆ కళ, పోటీ మరో స్థాయి.

అలాంటి బాక్సాఫీస్ ని గడ గడలాడించారు షకీలా. మలయాళంలో తన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అక్కడ స్టార్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముట్టి తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వచ్చేది. అంతటి క్రేజ్ షకీలా తన సినిమాలతో తెచ్చుకున్నారు. దాదాపు పదేళ్ళకి పైగానే శృంగార తారగా ఓ వెలుగు వెలిగారు. మలయాళంలో ఆమె నటించిన సినిమాలను ఇతర భాషలలోకి డబ్ చేసి రిలీజ్ చేయడంతో దేశ వ్యాప్తంగా షకీలా సినిమాలు చూసేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది.

ఆమె సినిమాలను చూసిన ఆనందించిన వారే మళ్ళీ ఏమీ ఎరగనట్టు తననే నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళు, ఆమెని దూషించినవారు ఉన్నారు. శృంగార తార అని బయట ప్రపంచానికి అనిపించినా ఆమెని ప్రేమిస్తున్నామని వెంటపడి అవసరం తీరాక మోసం చేసిన సినిమా ఇండస్ట్రీ వారు, రాజకీయ నాయకుల దగ్గర్నుంచి నిర్మాతలు, డబ్బున్న వ్యాపార వేత్తలు ఉన్నారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా షకీలా జీవుతం అంటే ఏంటో నేర్చుకుంది. తెలుగు, హిందీ భాషలలోనే కాకుండా నేపాలీ, చైనీస్, సింహళ భాషల్లోకి కూడా డబ్బింగు వర్షన్ రిలీజ్ చేశారు.

కెరీర్ ప్రారంభంలో మేకర్స్ చెప్పినట్టు నటించిన షకీలా ఆ తర్వాత మాత్రం డూప్‌గా కనిపించింది. దాదాపు 100కి పైగా శృంగార చిత్రాలలో నటించిన ఆమెకి అభిమానులు కూడా ఉన్నారు. ముఖ్యంగా షకీలా వ్యక్తిత్వం చాలామందికి ఎంతగానో నచ్చుతుంది. సమాజంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేసే షకీలా బయటికి దాన్ని ప్రచారం చేసుకోకపోవడం గొప్ప విషయం. ఇలాంటి వ్యక్తిత్వం ఉండటం వలనే ఆమెకి తెలుగులో దర్శక, నిర్మాతలు మంచి పాత్రల్లో నటించే అవకాశం కల్పించారు.  

తేజ దర్శకత్వంలో కొన్ని పాత్రలు పోషించిన షకీలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ దివంగత ప్రముఖ కమెడియన్ వేణు మాధవ్ షకీలాకి మంచి స్నేహితుడిగా మారారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంటుంది. ఈ విషయాన్ని ఒకప్పుడు ఆమెనే స్వయంగా వెల్లడించారు. వేణు మాధవ్ ఎప్పుడు చెన్నై వెళ్ళినా తప్పకుండా ఆమెని కలిసి వస్తుండేవారట. ఇక అవివాహితగా మిగిలిన షకీలా ఓ ట్రాన్స్‌జెండర్‌ను దత్తత తీసుకున్నారు. కొన్నేళ్లుగా తన బాగోగులన్నీ షకీలానే చూసుకుంటున్నారు.  

ఇక షకీలా సంపాదనంత తన అక్క, మిగతా కుటుంబ సభ్యులు కాజేసి రోడ్డున పడేసిన విషయాన్ని ఓ సందర్భంలో వెల్లడించి తనలోని బాధను పంచుకుంది. 2003 తర్వాత శృంగార చిత్రాలు మానేసి పెళ్ళి చేసుకొని హాయిగా గడపాలనుకున్న షకీలాకి తన కుటుంబ సభ్యులు సహకరించలేదు. ఈ విషయాన్ని మీడియా ముఖంగా చెప్పి వాపోయింది. డబ్బుకోసం తనని ఎంతలా వాడుకోవాలో అంతా వాడుకున్నారని చెప్పి తనలోని బాధను వెల్లగక్కిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘శివ’ ఫస్ట్ డేనే షాక్.. ఆ రోజు జరిగితే వర్మ కెరీర్ ముగిసేదే!

తెలుగు సినిమా చరిత్రలో కొత్త దారిని చూపించిన చిత్రాల్లో ‘శివ’ ఒకటి. ఈ సినిమా వెనుక జరిగిన సంఘటనలు ఇప్పటికీ…

3 minutes ago

మహిళల ఆరోగ్యానికి ఉపయోగపడే కొన్ని మొక్కలు.. రోజువారీ జీవితంలో చేర్చుకుంటే ప్రయోజనాలు ఎన్నో!

ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో మహిళలు ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడి, ఇంటి బాధ్యతలు, ఆహారపు అలవాట్ల మార్పులు…

8 minutes ago

ఇకపై AIతోనే వ్యాధులను ముందే గుర్తించే కొత్త వైద్య విప్లవం!

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా తన ముద్ర వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రారంభమైన AI ఆధారిత…

22 minutes ago

పిజ్జా అతిగా తింటున్నారా? ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణుల హెచ్చరిక!

పిజ్జా అంటే చాలామందికి ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్. రుచికరమైన చీజ్, సాస్, టాపింగ్స్‌తో ఇది ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ నిపుణులు…

29 minutes ago

ఒక్క చిన్న దోమ.. పెద్ద ప్రమాదం! వరల్డ్ మలేరియా డే సందేశం ఏమిటి?

ప్రతి ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ మలేరియా డేను నిర్వహిస్తారు. దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధి మలేరియా…

35 minutes ago

తిరుమల కల్తీ నెయ్యి కేసు.. దర్యాప్తు పూర్తి! 30న కీలక నివేదిక

తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యతపై వచ్చిన కల్తీ ఆరోపణలపై నియమించిన ఏకసభ్య కమిషన్ తన దర్యాప్తును పూర్తి…

41 minutes ago