చాలామంది హీరోయిన్స్ మోడలింగ్ రంగం నుంచి..లేదా ఇతర రంగాల నుంచి వచ్చి స్టార్ హీరోయిన్‌గా సెటిలవుతుంటారు. కొందరు డాక్టర్ చదివి కూడా హీరోయిన్ అవ్వాలనే కాంక్షతో ఇండస్ట్రీ వైపు వచ్చి సక్సెస్ అవుతుంటారు. కానీ ఓ జ్యోతిష్యం చెప్పే కుటుంబంలో పుట్టిన వాణీ విశ్వనాథ్ హీరోయిన్ అవుతుందని.. అయ్యాక తనలో ఉన్న ఆ రెండు క్వాలిటీస్ వల్ల చిరంజీవి లాంటి అగ్ర కథానాయకుల సరసన నటించే అవకాశాలు అందుకుంటుందని ఎవరూ ఊహించలేదు.
వాణీ విశ్వనాథ్ ఎక్కువగా మలయాళ, తెలుగు సినిమాలలో నటించి పాపులర్ అయింది. అలాగే తమిళ సినిమాలలోనూ నటించింది. ఆమె 1971, మే 13న త్రిశ్శూరు జిల్లా ఒల్లూరులో పుట్టారు. తన తండ్రి విశ్వనాథ్ జ్యోతిష్కుడు కావడంతో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఆయన దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవటానికి వస్తూ ఉండేవారు. ఆ సమయంలో 9వ తరగతి చదివే వాణీ విశ్వనాథ్ ని చూసి చక్కాగా ఉందని ప్రముఖ నటులు శివాజీ గణేశన్ నటించిన ‘మన్నుక్కుల్ వైరం’లో తీసుకున్నారు. ఇందులో వాణీ శివాజీ గణేశన్ మనవరాలిగా, ఓ వితంతు పాత్రలో నటించింది.
అయితే బాల్య వివాహాలకు సంబంధించిన కథ నేపథ్యం తెలుసుకొని వాణీ విశ్వనాథ్ చాలా బాధపడిందట. దాంతో మంచి మేకప్ వేసి ఈ సినిమాలో ఆమె కోసం ఒక డ్రీమ్‌సాంగ్ పెట్టారు. సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దాంతో అందరి దృష్టి వాణీ మీద పడింది. వాణీ విశ్వనాథ్ 14ఏళ్ళకే విజయకాంత్ నటించిన సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే జగపతి బాబు డెబ్యూ సినిమా, డ్యూయల్ రోల్ లో వచ్చిన ‘సింహస్వప్నం’ లో హీరోయిన్‌గా తెలుగులో అవకాశం వచ్చింది. ఈ సినిమా 1989లో విడుదలై ఫ్లాప్‌గా మిగిలింది.
అయినా ఆమెకి 1992 లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘ఘరానా మొగుడు’ సినిమాలో నగ్మాతో పాటు నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాలో వాణీ వాన పాటలో అందాలు ఆరబోసి గ్లామర్ హీరోయిన్‌గా మంచి తెచ్చుకుంది. సినిమాలో ఈ సాంగ్ చాలా హైలెట్‌గా నిలిచింది. అంతేకాదు వాణీ విశ్వనాథ్‌కి సినిమాలో ఒక్క వాన పాటలో అయినా నటించాలని ఆసక్తి ఉండేది. ఈ సినిమా తర్వాత తెలుగులో వరుస అవకాశాలు దక్కించుకుంది.
‘నా మొగుడు నాకే సొంతం, మా ఇంటి కథ, కొదమ సింహం, వదిన గారి గాజులు, ప్రేమ చిత్రం పెళ్ళి విచిత్రం, మామా – కోడలు, లేడీస్ స్పెషల్, జోకర్, ప్రేమ అండ్ కో, రైతు భారతం’ వంటి తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి స్టార్ హీరోయిన్ గా వెలిగింది. వాణీ విశ్వనాథ్ స్మైల్ అంటే ఇండస్ట్రీలో దర్శకులకి చాలా ఇష్టం. రాఘవేంద్రరావు ఘరానా మొగుడులో ఆమె స్మైల్ ని చాలా హైలెట్ చేశారు. ఇక అభిమానులకైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్లిమ్ పెర్సనాల్టి, హైట్, ఫిజిక్ తో అందంగా ఉన్న వాణీ విశ్వనాథ్ హీరోయిన్ కావడానికి బాగా తోడ్పడ్డాయి. ముఖ్యంగా గ్లామర్, సెక్స్ అప్పీల్.. ఈ రెండు వాణీ విశ్వనాథ్ కి బాగా అవకాశాలు తెచ్చిపెట్టాయి.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…