Featured

ఇంటి పేరు కాదు పాట పేరు చెబితేనే ఈ హీరోయిన్ ని గుర్తుపడతారు.!!

ఈ నటి ముఖము అందమైన రోజా పువ్వులా వికసిస్తుంది. ఆమె గాత్రము చిలుక పలుకుల్ని మైమరిపిస్తుంది. బాలనటిగా ఎస్.వి.రంగారావు తో అభినయించింది. సావిత్రమ్మతో నటించింది. మద్రాసులో పుట్టి పెరిగిన రోజారమణి. ఐదు సంవత్సరాల వయసులోనే ఈస్ట్ మన్ కలర్ భక్తప్రహ్లాద సినిమాతో తెలుగు తెరపై కనిపించిన రోజా రమణి దాదాపు 70 కి పైగా సినిమాల్లో బాలనటిగా చేసింది. అందులో సత్య కాలపు సత్తయ్య, అరుంధతి, రామాలయం, జరిగిన కథ వంటి చిత్రాల్లో నటించింది. బాల నటుల వయస్సు 12 సంవత్సరాలు దాటితే ఇక సినిమా అవకాశాలు దొరకడం చాలా కష్టం ఎందుకంటే 12 సంవత్సరాల నుంచి వారికి ఎలాంటి పాత్రలు ఉండవు.

ఆ క్రమంలో రోజారమణి మెల్లిగా సినిమా అవకాశాలు తగ్గడంతో చాలా బాధ పడుతూ ఉండేది. అయితే అలా ఒకసారి రోజా రమణి తన 13 సంవత్సరాల వయసులో శంబరతి అనే మలయాళ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అదే సినిమాను తెలుగులో కన్నె వయసు గా రిమేక్ చేశారు. ఇక్కడ కూడా అద్భుత విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దక్షినాది చిత్రాల్లోనే కాకుండా ఒరియా హిందీ చిత్రాల్లో కూడా నటించింది. ఆ తర్వాత మురళీమోహన్ సలహా మేరకు తనకు ఇష్టం లేకున్నా సినీ కథానాయికలకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది. అయిష్టంగా ప్రారంభించిన రోజారమణి సుహాసిని, రాధిక, విజయశాంతి, రాధా, రజిని, ఊర్వశి, మీనా, రోజా, రమ్యకృష్ణ లాంటి ఎంతో మంది కథానాయికలకు తన గాత్రాన్ని దాదాపు 400కు పైగా చిత్రాలకు అందించింది.

తెలుగువాడైన ఒరియా చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న చక్రపాణి నుంచి రోజా రమణి వివాహమాడారు. ఆ తర్వాత ఒరియాలో రోజారమణి, చక్రపాణి లు నటించారు. వీరిద్దరికీ నువ్వే కావాలి హీరో తరుణ్ జన్మించాడు. అయిష్టంగా డబ్బింగ్ మొదలు పెట్టినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఆ సినిమాలే రోజారమణి కి మంచి పేరు తీసుకువచ్చాయి. ప్రముఖుల శుభకార్యాలలో లేదా ఎయిర్పోర్టులో ఎవరైనా కలిసినప్పుడు నువ్వు “ఏ దివిలో విరిసిన పారిజాతమో….” (కన్నె వయసు) ఆ సినిమాలో నటించారు కదా. లేదా “ఏమని వర్ణించను ఈ కంటి వెలుగు ను వెన్నంటి మనసును..(డ్రైవర్ రాముడు) ఈ పాటలో నటించింది మీరే కదా అని అడిగేవారు. ఐతే ఈ రెండు చిత్రాల్లో ఏదైనా ఒక పాట పాడేవారు అలా ఒకప్పటి హీరోయిన్ రోజా రమణిని అభిమానులు గుర్తుపట్టేవారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago