క్రియేటివ్ కమర్షియల్స్ రేడియోలో వ్యాపార ప్రకటనలతో ప్రారంభమైన ఈ సంస్థ మెగాస్టార్ చిరంజీవి తో అభిలాష, చాలెంజ్ మరణ మృదంగం, స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ లాంటి అత్యధిక సినిమాలను చేయడం జరిగింది. చిరంజీవితో స్టువర్టుపురం పోలీస్ స్టేషన్ సినిమా తీసి అపజయంతో ఉన్న క్రియేటివ్ కమర్షియల్ అధినేత కె.ఎస్.రామారావు డి.రామానాయుడు తో కలిసి తమిళంలో విడుదలైన చిన్న తంబి సినిమా చూడడం జరిగింది.
ఈ సినిమాలో ప్రభు,ఖుష్బూ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చూసిన డి.రామానాయుడు ఇది వెంకటేష్ కి సూటు కాదని చెప్పారు. అప్పటికే వెంకటేష్ బొబ్బిలి రాజా వంటి యాక్షన్ సినిమాలు చేస్తున్నాడు. అలాంటి సమయంలో ఒక సాఫ్ట్ రోల్ ని వెంకటేష్ చేయడం అంతగా బాగుండదని డి.రామానాయుడు అనడంతో కె.ఎస్.రామారావు చేసేదిలేక రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ తో సినిమా చేస్తున్నట్టు పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డి.రామానాయుడు పెద్ద కుమారుడైన సురేష్ బాబు, రెండవ కుమారుడైన వెంకటేష్ కలిసి చిన్న తంబీ సినిమా చూడడం జరిగింది. అది సురేష్ బాబుకు నచ్చడంతో వెంకటేష్ తో ఆ సినిమా చేయమని కె.ఎస్.రామారావు కి ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు వెంకటేష్ డేట్స్ ఉన్నాయని కె.ఎస్.రామారావు రాజేంద్రప్రసాద్ తో చంటి సినిమా రద్దు చేసుకొని వెంకటేష్ హీరోగా సినిమా మొదలు పెడదాం అనుకున్నాడు.
కానీ దీనికి రవిరాజా పినిశెట్టి ఒప్పుకోలేదు. ఇదివరకే రాజేంద్రప్రసాద్ హీరోగా అనుకొని మళ్లీ ఇప్పుడు వెంకటేష్ తో తీయడం కరెక్ట్ కాదని అవసరమైతే సినిమా నుంచి తప్పుకుంటానని చెప్పారు. కె.ఎస్.రామారావు ఏమి చేయాలో అర్థంకాక వెళ్లి చిరంజీవిని కలిశారు. అప్పుడు చిరంజీవి రవిరాజా పినిశెట్టి తో మాట్లాడి వెంకటేష్ హీరోగా చంటి సినిమా ప్రారంభం కావడానికి ప్రయత్నించారు. అలా1991 జూలై 4న మద్రాసులోని క్రియేటివ్ కమర్షియల్స్ ఆఫీసులో చంటి సినిమాని లాంఛనంగా ప్రారంభించారు. రవిరాజా పినిశెట్టి టేకింగ్, ఇళయరాజా అద్భుతమైన బాణీలు సినిమా విజయానికి కారణమయ్యాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…