General News

వ్యవసాయంతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్న రైతు.. ఎలా అంటే..?

కాలం మారే కొద్దీ దేశంలో వ్యవసాయంపై ఆసక్తి చూపే వారి సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. చాలామంది విద్యార్థులు కార్పొరేట్ కొలువులు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. మంచి వేతనం ఉన్న ఉద్యోగం దొరకకపోతే తక్కువ వేతనం ఉన్నా వ్యవసాయం చేయడానికే యువత ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి వ్యవసాయం వేపు వెళ్లాడు. సంవత్సరానికి కోట్లలో సంపాదిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

మహారాష్ట్రలోని దౌండ్ గ్రామానికి చెందిన సమీర్ డోంబే ఏడేళ్ల క్రితం ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేశారు. అయితే కొంతకాలం తరువాత అతనికి ఆ ఉద్యోగం నచ్చలేదు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో అతనికి వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా ఉద్యోగాన్ని వదిలి సమీర్ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని అనుకున్నాడు. అయితే అతని నిర్ణయాన్ని అందరూ తప్పుబట్టారు.

అయితే అతను మాత్రం ఇతరుల గురించి ఆలోచించకుండా తనకు ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో అంజీరా పండ్లను సాగు చేశాడు. సాధారణంగా అంజీరా పండ్ల సాగు లాభసాటి అయినా రైతులు మార్కెట్ లో అమ్మడం వల్ల నష్టపోతూ ఉంటారు. తను కూడా అలా నష్టపోకూడదని భావించి అతను కొన్ని సూపర్ మార్కెట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంజీరా పండ్లను పవిత్రక్ పేరుతో కిలో బాక్సుల చొప్పున విక్రయించాడు.

ఊహించని విధంగా పవిత్రక్ పేరుతో అతను చేసిన వ్యాపారం సక్సెస్ అయింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా అతని పండ్లకు ఆర్డర్లు వచ్చాయి. ప్రస్తుతం సమీర్ నెలకు 13 లక్షల రూపాయలు సంపాదిస్తూ కోటిన్నర టర్నోవర్‌ తో వార్తల్లో నిలిచాడు. ఒకప్పుడు అతనిని విమర్శించిన వాళ్లే ఇప్పుడు అతని నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago