సీనియర్ హీరో అక్కినేని నాగేశ్వరరావు నిర్మించిన అన్నపూర్ణ స్టూడియోలో వందల, వేల సినిమాలు చిత్రీకరించబడ్డాయి. ఇప్పటికీ ఎన్నో సినిమాలు సీరియళ్లు, ప్రోగ్రాములు అన్నపూర్ణ స్టూడియోలో రూపుదిద్దుకుంటూనే ఉంటాయి. అప్పట్లో దక్షిణాది సినిమాలన్నింటికీ కేంద్రబిందువుగా మద్రాసు ప్రెసిడెన్సీ నిలిచేది. సినిమా నిర్మాణానికి సంబంధించిన పరిజ్ఞానం అంతా కూడా మద్రాసులోనే ఉండటంతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలన్నీ కూడా అక్కడే చిత్రీకరణ జరుపుకునేవి. పొద్దస్తమానం మద్రాసు ట్రావెల్ చేయలేక చాలామంది హీరోహీరోయిన్లు అక్కడే స్థిరపడిపోయారు.
1962 వ సంవత్సర కాలం నుండి హైదరాబాద్ నగరంలో చిన్నాచితకా సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. 1970వ సంవత్సరంలో మన దగ్గరి ప్రదేశాల్లోనే ఒక స్టూడియో నిర్మించాలని.. ఇక్కడే సినిమాలు రూపొందించాలనే ఒక ఆలోచన అప్పటి ఏపీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డికి వచ్చింది. 1973వ సంవత్సరంలో జలగం వెంగళరావు చొరవతో హైదరాబాద్ నగరంలో ఒక ప్రదేశాన్ని సినిమా స్టూడియో కోసం కేటాయించడంతో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు ఆ స్థలాన్ని కొనుగోలు చేసి 75 వ సంవత్సరంలో అన్నపూర్ణ స్టూడియో ని ప్రారంభించారు.
అయితే ఈ స్టూడియో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టిందట. ఎందుకంటే కేటాయించబడిన స్థలం లో అతి పెద్ద బండ రాళ్ళు వంటివి చాలా ఉండేవట. వాటన్నిటినీ తొలగించి స్థలాన్ని చదును చేయడానికి రెండేళ్ల సమయం పట్టిందట. 22 ఎకరాల స్థలంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణాన్ని అక్కినేని నాగేశ్వరరావు చాలా శ్రద్ధ తీసుకొని రూపుదిద్దారట.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…