Categories: FeaturedMovie News

గోవాలో 3 రోజులకు న‌య‌న తార ఖర్చు 30 ల‌క్ష‌లు.. ముక్కున వేలేసుకుంటున్న సినీ ప్రముఖులు !!

“చంద్రముఖి” చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార నయనతార. ఆ తర్వాత “లక్ష్మి” చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన నటించి అగ్ర హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయింది. అతి తక్కువ కాలంలోనే బాస్, యోగి, తులసి, దుబాయ్ శీను తదితర చిత్రాలలో అగ్ర హీరోల సరసన ఈ మలయాళ భామ నటించి.. చూపరులను ఇట్టే ఆకర్షించగల తన అందంతో దక్షిణాది సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపుతోన్న నయనతారకు ఆమె కుటుంబం అంటే చాలా ఇష్టం.

ఎలాంటి కష్టమైనా తన కుటుంబ సభ్యులతోనే పంచుకుంటానని నయన తార చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది. తన ఇమేజ్‌ను పాడు చేసేందుకు ఎందరో ప్రయత్నించారని, ఆ సమయంలో తన కుటుంబ సభ్యులే తనకు ఎంతో అండగా నిలిచారని, ఎన్ని కష్టాలు ఎదురైన తామున్నామని ప్రోత్సహించే కుటుంబ సభ్యుల సహకారంతోనే తానీస్థాయికి ఎదిగానని ఆ ఇంటర్వ్యూలోనే తెలియజేసింది. టాలీవుడ్ & కోలీవుడ్ సూప‌ర్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న న‌య‌న తార, ఆమె ప్రియుడు, ద‌ర్శ‌కుడు విఘ్నేష్‌ శివ‌న్ ‌తో క‌లిసి ఈమధ్యనే గోవా టూర్ వెళ్లిన సంగతి సోషల్ మీడియాలోని నెటిజన్లందరికీ తెలిసిందే.

గత నాలుగేళ్లుగా నిండా ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ ప్రేమ జంట‌ తమకున్న వ్యక్తిగత టెన్ష‌న్‌ల‌న్నిటినీ ప‌క్క‌న‌పెట్టి ప్రశాంతంగా ఎంజాయ్ చేశారు. సెప్టెంబ‌ర్ 18న‌ విఘ్నేష్‌ 35వ పుట్టిన‌రోజు వేడుక‌లు కూడా జ‌రుపుకున్నారు. అయితే అంతకన్నా 3 రోజుల ముందు విఘ్నేష్‌ త‌ల్లి పుట్టిన‌రోజునూ సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ బర్త్ డే వేడుక‌ల‌కు సంబంధించిన‌ కొన్ని ఫొటోలు లేటెస్ట్ గా సోష‌ల్ మీడియాలో షికార్లు చేశాయి. అయితే అందాల తార న‌య‌న తార ప్రియుడి బ‌ర్త్ ‌డే కోసం భారీగానే ఖ‌ర్చు పెట్టిన‌ట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. కోలీవుడ్ సినీ వ‌ర్గాల ప్ర‌కారం ఈ ప్రేమ‌ జంట 3 రోజులు పాటు గోవాలో ఉన్నందుకుగానూ న‌య‌న్ 25 ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు తాజా స‌మాచారం. గతంలో ‘నానుమ్ రౌడీదాన్’ చిత్రం షూటింగ్ టైం లో న‌య‌న్‌, విఘ్నేష్‌లు ప్రేమ‌లో ప‌డ్డారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో విహార ‌యాత్ర‌లను ప్లాన్ చేస్తూ ప‌నిలో ప‌నిగా దేశ దేశాలను కూడా చుట్టివచ్చేశారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం న‌య‌న‌తార న‌టిస్తున్న “నెట్రిక‌న్” అనే చిత్రాన్ని ఆమె బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ నిర్మిస్తున్నారు. అలాగే ఆయ‌న ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న “కాదువాక్కుల రెండు కాద‌ల్” చిత్రంలో కూడా మన న‌య‌న తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఏదేమైనా కేవలం 3 రోజుల విహార యాత్ర కోసం ఇంత భారీగా ఖర్చుపెట్టడం చాలా ఆశ్చర్యకరమైన విషయమని సినీరంగ ప్రముఖులు ముక్కున వేలేసుకుంటున్నారు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago