Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన హీరోగా ఇటీవల నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ చిత్రం వార్ 2 లో కూడా ఎన్టీఆర్ నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు పలు అప్డేట్స్ విడుదల చేశారు. అయితే తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమా అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో దేవర సినిమా విడుదల అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ సినిమా పనులలో బిజీ కాబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు పెట్టబోయే టైటిల్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.
డ్రాగన్..
ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తుందనే విషయం తెలియదు. ఎలాంటి బ్యాక్ డ్రాప్ అయినా కూడా ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని ఇదివరకు ప్రశాంత్ తన సినిమాల ద్వారా చూపించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కావాల్సిందేనని అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…