విజయ్ సేతుపతి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇతను తమిళ, తెలుగు సినిమాలలో నటించి ఎంతోమంది ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. ఇక ఈయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతని ఎప్పుడెప్పుడు కలవాలా అని అభిమానులు కుతూహలంగా ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ సేతుపతి పై అనూహ్య రీతిలో దాడి జరిగిన విషయం అందరికి తెలిసిందే.
అందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విజయ్ సేతుపతి ఎయిర్ పోర్ట్ లో ఒక వ్యక్తి ఎగిరి తన్నడం సంచలనంగా మారింది. అయితే విజయ్ సేతుపతి ఫై దాడికి ప్రయత్నించిన ఆ వ్యక్తి ఎవరు? అందుకు గల కారణం ఏమిటి?అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ సేతుపతిని కాలితో తన్నడం వెనుక ఏదో అసలైన కారణం ఉంది అంటున్నారు కొంతమంది విశ్లేషకులు.
ఇటీవలే కన్నడ పవర్ స్టార్ పునీత్ మరణించిన విషయం అందరికి తెలిసిందే. నదీ జలాల పంపకం విషయంలో కన్నడిగులు, తమిళ ప్రజల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. దీనితో ఆ వివాదాల కారణంగా పునీత్ ను కడసారి చూసేందుకు కానీ, అంత్యక్రియలకు కానీ తమిళ హీరోలు ఎవరూ రాలేదు. తమిళ హీరోలు అలా వెళ్లకపోవడం పై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపించాయి.
పునీత్ రాజ్ కుమార్ అభిమానులు అయితే సోషల్ మీడియా వేదికగా తమిళ హీరోలపై ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే హీరో విజయ్ సేతుపతి తాజాగా బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో కనిపించడంతో, కన్నడిగుడు ఆవేశంతో ఇలా చేసి ఉంటారని అంటున్నారు విశ్లేషకులు. అంతే కానీ కావాలని విజయ్ సేతుపతి పై దాడి చేసి ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అందరితో కలివిడిగా ఉండే ఈ స్టార్ కి ఇలాంటి చేదు అనుభవం ఎదురు కావడం ఆశ్చర్యానికి గురి చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…