Categories: FeaturedMovie News

క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. శ్వేతా వర్మ!

బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్వేతా వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమె ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి ఐదు వారాలకు ఎలిమినేట్ అయ్యి అనూహ్యంగా బయటకు వచ్చేసింది. అయితే శ్వేతా వర్మ బిగ్ బాస్ టాప్ ఫైవ్ లిస్ట్ లో కచ్చితంగా ఉంటుందని అనుకున్నారు.ఈ షో ద్వారా శ్వేతా వర్మ కొంత ఫేమ్ రాబట్టుకుంది.

పలు సినిమాలు,సిరీస్ లలో నటించినా రాని గుర్తింపు, బిగ్ బాస్ షో ద్వారా దక్కింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్వేతా వర్మ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది.ఈ క్రమంలోనే
తాజాగా ఒక ఇంటర్వ్యూలో శ్వేతా వర్మ మాట్లాడుతూ.. కాస్టింగ్ కౌచ్ పై పలు ఆసక్తికర కామెంట్స్ ను చేసింది. ఇండస్ట్రీలో ఈ కాస్టింగ్ కౌచ్ విషయం ఎప్పటినుంచో కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరోయిన్లు పలు సందర్భాలలో వాళ్లకు గురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. శ్వేతా వర్మ కూడా తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి తెలిపింది. నాతో చాలా మంది అసభ్యకరంగా మాట్లాడేవారిని.. ఛాన్స్ ఇస్తాం కమిట్మెంట్ ఇస్తారా అని అడిగే వారని అని చెప్పుకొచ్చింది.అంతే కాకుండా పారితోషికం ఎంతైనా ఇస్తాం మాకు సహకరిస్తే చాలు అనేవారట.ఆ సమయంలో వారు మాట్లాడే మాటలు ఆమెకు అర్థం కాలేదట.

ఆ తరువాత సహకరించడం అంటే వేరే అర్థాలు ఉంటాయి అని తెలుసుకున్నాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలా ఒక వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి ఒక యాడ్ షూటింగ్ ఉంది,రెమ్యూనరేషన్ లక్ష రూపాయల వరకు ఇస్తాం కాని వారికీ సహకరించాలని అడిగారు శ్వేతా వర్మ చెప్పుకొచ్చింది. అప్పుడు ఆమె కోపంతో లక్ష రూపాయలు ఇస్తే నన్ను కమిట్మెంట్ అవమంటున్నారు. మరి నేను ఎత్తైన బిల్డింగ్ మీద నుంచి దూకమంటాను దూకుతారా అని ప్రశ్నించడంతో అవతలి వ్యక్తి సైలెంట్ అయ్యాడట. ఇలా తనకు జరిగిన చేదు అనుభవం గురించి శ్వేతా వర్మ తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago