Tollywood: సినీ సెలబ్రిటీలు వరుసగా కరోనా బారిన పడటం వెనుక దాగి ఉన్న కారణం ఇదేనా?
Tollywood: కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాపుతోంది.ఈ క్రమంలోనే రోజురోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడంతో మరో సారి ప్రతి ఒక్కరు భయాందోళనలకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా కరోనా మొదటి రెండవ దశలో ఎంతోమంది సిని సెలబ్రిటీలు కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోగా మరికొందరు సురక్షితంగా బయటపడ్డారు.
అయితే ఈ రెండు దశల్లో కాకుండా ప్రస్తుతం సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇలా బాలీవుడ్, టాలీవుడ్, కోలీ వుడ్ పరిశ్రమలలో ఎంతోమంది సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇలా వరుసగా సినీ ప్రముఖులు కరోనా బారిన పడటంతో చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడినట్లుగా తెలిపారు. ముఖ్యంగా రెండు రోజుల వ్యవధిలో ఎంతో మంది సెలబ్రిటీలు ఈ మహమ్మారికి గురైనట్లు ప్రకటించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వీరందరూ ఒక్కసారిగా మహమ్మారి బారిన పడటానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కోసం పలువురు సెలబ్రిటీలు ఇతర దేశాలకు వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. ఇలా నూతన సంవత్సరం తర్వాత పలువురు కోవిడ్ బారిన పడగా, మరికొందరు మాత్రం నూతన సంవత్సర వేడుకల కోసం ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త హైదరాబాద్ నగర శివారులో నిర్వహించిన పార్టీలో పాల్గొన్నారని, ఈ పార్టీలో ఏ విధమైనటువంటి కరోనా నిబంధనలను పాటించకపోవడంతో వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తిందనే వార్తలు వినబడుతున్నాయి. మొత్తానికి నూతన సంవత్సర వేడుకలే వీరికి ఈ పరిస్థితి తీసుకు వచ్చాయా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…