‘కలసి ఉంటే కలదు సుఖం’ సీరియల్ అనేది తెలుగు భాషలో రాబోయే కుటుంబ కథా సీరియల్. ఈ సీరియల్ 20 డిసెంబర్ 2021 నుండి ‘స్టార్ మా’ ఛానెల్‌లో ప్రారంభమవుతుంది. బిగ్ బాస్ 5 ముగిసిన వెంటనే ఈ సీరియల్ ను ప్రసారం చేయనున్నారు.
కలసిఉంటే కలదుసుఖం సీరియల్‌లో సీనియర్ తెలుగు సినీ నటి ‘ప్రభ’ ప్రధాన పాత్రలో చేయనున్నారు. ఇది సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 10 గంటలకు ప్రీమియర్ కానుంది . ఇక సీనియర్ నటి ప్రభ గురించి మాట్లాడితే.. వెండితెరపై ఒకప్పుడు మకుటం లేని మహరాణులుగా రాణించినవాళ్లు.. ప్రస్తుతం కొంతమంది సీరియల్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ లను మొదలు పెట్టేశారు.
ఇలా బుల్లితెరకు వచ్చి కొన్నాళ్లు ఇక్కడే ఉండి.. మళ్లీ వెండితెరకు వెళ్లిపోయినవాళ్లు ఉన్నారు. ఇలా వెండితెర నుంచి బుల్లితెరకు.. బుల్లితెర నుంచి వెండితెరకు ఇలా మారుతూనే ఉన్నారు. అందులో ముఖ్యంగా సీనియర్ నటి రాశి ఉన్నారు. ఆమె బుల్లితెరలో ప్రసారం అవుతున్న ‘జానకి కలగనలేదు’లో లీడ్ రోల్ చేస్తోంది. దీనిలో ఈమె జ్ఞానాంబ పాత్రకు మంచి పేరు వస్తోంది.
అంతే కాదు శుభలగ్నం సినిమాతో ఎంతో ఫేమ్ తెచ్చుకున్న ఆమని కూడా.. బుల్లితెరపై ముత్యమంత ముద్దు సీరియల్ లో లీడ్ రోల్ చేస్తోంది. ఇలా సీనియర్ నటీమణులు.. వయస్సు మీద పడుతున్న కొద్ది.. బుల్లితెరపైకి వచ్చి.. ఇక్కడ వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకొని ముందుకు సాగుతున్నారు. ఇక త్వరలోనే మన ముందుకు రానున్న ‘కలసి ఉంటే కలదు సుఖం’ సీరియల్ లో నటి ప్రభ ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…