Categories: FeaturedMovie News

Ismart Anjali : నడిరోడ్డుపై నాన్న వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు : ఇస్మార్ట్ అంజలి

Ismart Anjali : tv9 లో ఇస్మార్ట్ న్యూస్ చదువుతూ బాగా ఫేమస్ అయిన తెలంగాణ అమ్మాయి ఆరోహి రావు అలియాస్ ఇస్మార్ట్ అంజలి బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా వెళ్ళింది. ఇక ఇపుడు అంజలి నేపధ్యం గురించి ఆమె బ్యాక్ గ్రౌండ్ గురించి బిగ్ బాస్ ప్రేక్షకులు వెతకడం మొదలు పెట్టారు. అంజలి అసలు పేరు ఆరోహి రావు సొంతూరు పరకాల దగ్గర పల్లెటూరు. అమ్మ చిన్నతనంలో మరణించడం తో నాన్న మరో పెళ్లి చెసుకోవడం, గొడవల కారణంగా అమ్మమ్మ వద్ద పెరిగింది ఆరోహి రావు. ఇక ఆరోహికి ఒక అన్న ఉన్నాడు. ఇక పదో తరగతి వరకు పల్లెటూరులో చదివిన ఆరోహి ఆ తరువాత వరంగల్ కు వెళ్లి పై చదువులు అక్కడే చదివింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరం అవడంతో ఎంతో బాధను అనుభవించానని, ఈ ప్రపంచంలో మనకు ఎవరూ తోడు ఉండరని, ఒంటరి అనే భావన చిన్నవయసులోనే వచ్చేసిందని చెప్పింది ఆరోహి రావు.

నాన్న నడిరోడ్డు పై వదిలి వేరే పెళ్లి చేసుకున్నాడు…

చిన్నతనంలోనే తల్లి చనిపోతే తండ్రి మా బాధ్యత తీసుకోకుండా వేరే పెళ్లి చేసుకొని మమ్మల్ని వదిలేసాడు అంటూ అంజలి ఎమోషనల్ అయింది. ఇక నాన్న రెండో పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో అమ్మమ్మ నన్ను అన్నను పెంచి చదివించింది. నాన్న చనిపోయాక మళ్ళీ ఆయనను చూసాను అంతవరకు ఒక్కసారిగా కూడా చూసింది లేదు, కలిసింది లేదు. నాన్న ప్రేమ ఏంటో కూడా నాకు తెలియదు.

అమ్మ ప్రేమ లేకపోతే, నాన్న మమ్మల్ని చూడక ఒంటరితనంతో చాలా ఏడ్చేదాన్ని. అయితే చదివేటపుడు ప్రపంచంలో ఎవరూ మనకంటూ ఉండరని అర్థం చేసుకున్నాను. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలని అర్థమైంది అంటూ అంజలి తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పి ఎమోషనల్ అయింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉన్న అంజలి టీవీ9 ఇస్మార్ట్ న్యూస్ ద్వారా బాగా ఫేమస్ అయి ఇపుడుబిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago