టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శశకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ తో పాటు యూత్ లో మాంచి క్రేజ్ ను దక్కించుకుంది నభా నటేష్…సినిమాలో తన అంద చందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది ఈ ఇస్మార్ట్ బ్యూటీ.. ఈ సినిమా తో నభనటేష్ పేరు టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది.
అందంతోపాటు నటనతో ఆకట్టుకున్న నభనటేష్ ఆతర్వాత రవితేజ నటించిన డిస్కో రాజా సినిమాలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.ఇప్పుడు ఈ వయ్యారి యంగ్ హీరో నితిన్ తో జతకట్టనుంది. కుర్ర హీరో నితిన్ నటిస్తున్న బాలీవుడ్ సూపర్ హిట్ అంధాధున్ రీమేక్ మ్యాస్ట్రో సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ లో ఓ భారీ ఆఫర్ ను అందుకుందని తెలుస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు శివ కొరటాల దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత ఆ కలయికలో ఎన్టీఆర్ 30వ సినిమాగా ఈ మూవీ రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల ట్వీట్ చేశారు. జూన్ రెండో వారం నుంచి ఈ మూవీ షూటింగ్ మొదలు కానుంది.
ఈ సినిమాలో హీరోయిన్ గా కైరా అద్వాని పేరు ఎక్కువగా వినిపిస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ గా నాభ నటేష్ నటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది.. ఇందులో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ. ఇదే కనుక నిజమైతే ఎన్టీఆర్ సినిమాతో మళ్ళీ నభా నటేష్ టాలీవుడ్ లో హీరోయిన్ గా బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు..మరి దీనిపై త్వరలోనే ఓ స్పష్టత ఇవ్వనుందట చిత్ర యూనిట్.ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ RRR సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇప్పటికే క్లైమాక్స్ షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా విడుదల ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల దృష్ట్యా మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది..!!
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…