General News

ఇరాన్ మీడియా సంస్థలపై ఇజ్రాయెల్ దాడులు.. భయంతో యాంకర్ పరుగులు !

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. తాజాగా, ఇరాన్‌లోని ఓ న్యూస్ ఛానెల్ బిల్డింగ్‌పై ఇజ్రాయెల్ మిసైల్ దాడి చేసింది. ఈ దాడి సమయంలో, స్టూడియోలో మహిళా యాంకర్ న్యూస్ చదువుతుండగా, మిస్సైల్ భవనంపై పడటంతో ఆమె భయంతో పరుగులు తీసింది. బిల్డింగ్ కదలడంతో కరెంట్ కట్ అయింది. ఈ దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Israeli attacks on Iranian media outlets.. Anchors run in fear!

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అణు శాస్త్రవేత్తలు, కీలక సైన్యాధికారులు ప్రాణాలు కోల్పోయారు. రాజధాని టెహ్రాన్‌కు టార్గెట్ చేసిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, క్షిపణులతో విరుచుకుపడింది. చమురు శుద్ధి కేంద్రాలు, సహజ వాయువు నిక్షేపాలను కూడా ధ్వంసం చేసింది.

ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేసేందుకు పనులు జరుగుతున్నాయని, ఇది తమకు ముప్పుగా భావించే ఇరాన్‌పై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఈ దాడులు ఇరాన్‌లోని సైనిక, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితులు మధ్యప్రాచ్య ప్రాంతంలో యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది.

ఈ పరిస్థితుల్లో, అంతర్జాతీయ సంఘం మధ్యవర్తిత్వం వహించి, ఇరుపక్షాల మధ్య శాంతి ఒప్పందానికి కృషి చేయాల్సి ఉంది. లేకపోతే, ఈ యుద్ధం మధ్యప్రాచ్య ప్రాంతంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా భయంకర పరిణామాలను కలిగిస్తుంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago