General News

తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకూ ఆస్తి కోసం వాటా అడగకుండా చట్టం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

తల్లిదండ్రులు ఇంకా బతికే ఉన్నా, పిల్లలు సొంత ఆస్తి కోసం తోడబుట్టిన వారితో పోట్లాడుకోవడం ఏంటి? ఈ విషయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకూ పిల్లలు ఆస్తి కోసం వాటా అడగకుండా చట్టం ఉంటే బాగుండేదని హైకోర్టు అభిప్రాయపడింది.

Law prohibits asking for share in property as long as parents are alive..

44 గజాల స్థలం కోసం కోర్టు మెట్లు ఎక్కిన కుటుంబం కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 264 గజాల స్థలం కోసం ఆరుగురు కుటుంబసభ్యులు హైకోర్టులో పిటిషన్ వేయగా, ఒక్కొక్కరికి 44 గజాల స్థలం మాత్రమే వస్తుందని, అందులో ఇల్లు కూడా కట్టుకోలేరని న్యాయమూర్తి అన్నారు.

తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా అడగకుండా చట్టం తీసుకువచ్చే అధికారం ఉంటే బాగుండేదని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తమ తల్లిదండ్రుల ఆస్తిపై పిల్లలు ఎందుకు అధికారం చెలాయిస్తున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ఈ విషయంలో చట్టం మార్పులు తీసుకురావాలని హైకోర్టు సూచించింది. తల్లిదండ్రులు బ్రతికి ఉన్నంత వరకు పిల్లలు ఆస్తిలో వాటా అడగకుండా చట్టం ఉంటే కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయని, కుటుంబ సమగ్రత కాపాడుకోవచ్చని భావిస్తున్నారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago