Featured

Pawan Kalyan-KTR: పాతికేళ్లు అయినా స్టార్ డమ్ కాపాడుకోవడం పవన్ కే సాధ్యం…కేటీఆర్, సినిమానే నాకు అన్నం పెట్టింది: పవన్ కళ్యాణ్

Pawan Kalyan-KTR: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా… ‘ భీమ్లా నాయక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఆశేష పవన్ అభిమానుల మధ్య ఉత్సాహంగా కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమానికి తెలంగాణ రాష్ఱ్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రావడం మరింత ప్రాధాన్యత సంచరించుకుంది. ఓ వైపు పవర్ స్టార్.. మరోవైపు పొలిటికల్ స్టార్ ఇలా ఇద్దరు స్టార్లు ఒకే వేదికపై కలవడం వారి ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. 

Pawan Kalyan-KTR: పాతికేళ్లు అయినా స్టార్ డమ్ కాపాడుకోవడం పవన్ కే సాధ్యం…కేటీఆర్, సినిమానే నాకు అన్నం పెట్టింది: పవన్ కళ్యాణ్

కేటీఆర్ మాట్లాడుతూ… రాజకీయాలు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా తనను ఆహ్వానిస్తే ఓ సోదరుడిలా వచ్చానన్నారు మంత్రి కేటీఆర్‌.  పవన్‌ కల్యాణ్‌ అందరూ సూపర్‌ స్టార్‌లు, సినిమా స్టార్‌లు మాదిరిగా కాకుండా ఓ విలక్షణమైన హీరో అంటూ కొనియాడారు. కేవలం తన నటనే కాదు విలక్షణమైన శైలీ కలిగిన వ్యక్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఎందరో అభిమానుల్ని, క్రేజ్‌ని సంపాధించుకువోవడం అసాధారణమైన విజయం అన్నారు. కాలేజీ రోజుల్లో పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన తొలిప్రేమ సినిమా చూస్తూ ఎంజాయ్ చేసాం అని చెప్పారు. పాతికేళ్లుగా అదే స్టార్‌డమ్, అంతే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ని కాపాడుకోవడం పవన్‌ కల్యాణ్‌కే సాధ్యమైందన్నారు.

Pawan Kalyan-KTR: పాతికేళ్లు అయినా స్టార్ డమ్ కాపాడుకోవడం పవన్ కే సాధ్యం…కేటీఆర్, సినిమానే నాకు అన్నం పెట్టింది: పవన్ కళ్యాణ్

పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్‌ మాట్లాడారు. ఈవెంట్‌కి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు కేటీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పరిశ్రమకు కులాలు, రాజకీయాలతో సంబంధం లేదన్నారు పవర్ స్టార్. కళాకారులకు కులం, మతం, ప్రాంతం ఉండదన్నారు. గతంలో చెన్నైలో ఉన్న చిత్రపరిశ్రమను హైదరాబాద్‌కి తెచ్చేందుకు చెన్నారెడ్డి లాంటి పెద్దలు ఎంతో కృషి చేస్తే..ఇప్పుడు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో చిత్రపరిశ్రమ మరింత ముందుకు వెళ్తోందన్నారు పవన్‌ కల్యాణ్.

నాకు అన్నం పెట్టింది సినిమాలే..


తనకు  సినిమాలు తప్ప వేరే పని తెలియదన్నారు పవన్ కళ్యాణ్. సినిమాల ద్వారా వచ్చిన ఆదరణతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానన్నారు. సినిమా పరిశ్రమలో నటిస్తూనే డబ్బులు సంపాధించుకుంటున్నానని చెప్పారు. దేశం, రాష్ట్రం, తెలుగు ప్రజలకు ఏమైనా చేయాలన్న ఆలోచనతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానంటూ రాజకీయ ప్రస్తావన తెచ్చారు పవన్ కల్యాణ్. తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం తనకు తెలియదన్న పవన్ కల్యాణ్..భీమ్లానాయక్  అందరికి నచ్చుతుందని చెప్పారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ప్రేమకే రికార్డ్ సెట్ చేసిన లవర్..ఒక్క రోజుకు 25,000 రూపాయల ఆర్డర్లు!

ప్రేమికుల రోజు: గిఫ్ట్‌లు, కేకులు, ఆనందం ప్రతి ఏడాది ఫిబ్రవరి 14 వ తేదీ ప్రపంచంలోనూ, తెలుగు రాష్ట్రాలనూ ప్రేమికుల…

9 minutes ago

BIG BREAKING: తెలుగు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపులు – భద్రతా చర్యలు ముమ్మరం

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం,…

37 minutes ago

కేజీ వెండి ధర కుప్పకూలింది.. దేశవ్యాప్తంగా ఒకేసారి భారీ తగ్గుదల!

వెండి, బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న హెచ్చుతగ్గులు మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని వారాలుగా పసిడి, వెండి రేట్లు…

1 hour ago

హలీం.. రంజాన్ సీజన్‌లో ఆరోగ్య బోనస్! దీని ప్రయోజనాలు తెలుసుకున్నా వదలలేరు..

రంజాన్ సీజన్ ప్రారంభం, హలీం సందడి రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో హలీం విందుల…

1 hour ago

ఇకపై రిస్క్‌ వద్దు.. ప్రభాస్ పెద్ద ప్రాజెక్ట్స్ విషయంలో కచ్చితమైన నిర్ణయం..!

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ కెరీర్ మరో మలుపు తిరుగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథ…

2 hours ago

“అత్యాచారం తర్వాత హత్య… ఇప్పుడు నిందితుడి మృతి – అన్నమయ్య జిల్లాలో సంచలనం!”

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అన్నమయ్య జిల్లా ఘటనకు మరో కీలక మలుపు తిరిగింది. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడని…

2 hours ago