Mohanbabu Family: వారిపై కేసు పెట్టిన మోహన్ బాబు ఫ్యాన్స్.. ఎందుకంటే..!
Mohanbabu Family: మంచు ఫ్యామిలీపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మధ్య విడుదలైన మోహన్ బాబు ‘ సన్ ఆఫ్ ఇండియా’ సినిమా ప్లాప్ కు కారణం ఈ ట్రోలింగే అంటూ.. మంచు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇటీవల ట్రోలింగ్ పై కూడా మంచు మోహన్ బాబు స్పందించారు. ఓ ఇద్దరు హీరోలు పనికట్టుకుని ట్రోలింగ్ చేస్తున్నారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఈ కామెంట్ల గురించి కూడా చివరకు ట్రోలింగ్ చేశారు.
ఇటీవల మోహన్ బాబు, మంచు విష్ణు ట్రోలర్స్ పై 10 కోట్ల పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మంచు ఫ్యామిలీ కూడా చాలా సీరియస్ అయింది. అయితే.. తాజాగా మోహన్ బాబు ఫ్యాన్స్ మంచు ఫ్యామిలీని ట్రోల్ చేస్తున్న వారి పై కేసు నమోదు చేశారు
శ్రీ మంచు యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సునీల్ చక్రవర్తి.. తిరుపతి అర్బన్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో కేసు నమోదు చేశారు. ఆయన మాట్లాడుతూ…‘గత 20 ఏళ్లుగా మోహన్ బాబుగారి ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ గా ఉన్నాను. ఎప్పుడు కూడా మోహన్ బాబు ఫ్యాన్స్ వేరే హీరోలపై కామెంట్స్ చేయలేదు. మోహన్ బాబు ఇటీవల నటించిన సన్ ఆఫ్ ఇండియా మూవీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పటి నుండి కొంతమంది ట్రోలర్స్ మంచు కుటుంబం పై తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. 1, 2 కాదు 100 పైగా యూట్యూబ్ ఛానల్స్ వారు సినిమా రిలీజ్ ముందే సినిమా బాగాలేదని ట్రోల్ చేసి ప్రేక్షకులను థియేటర్లకు రాకుండా చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేశాం’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…