Featured

IT Minister Sridhar Babu: కేటిఆర్ కి ధీటుగా దుద్ధిల్ల శ్రీధర్ బాబు… క్రికెటట్ ప్లేయర్, లాయర్ ఇప్పుడు ఐటీ మినిస్టర్…

IT Minister Sridhar Babu: తెలంగాణ ఎన్నికల నేపథ్యం, బీఆర్‌ఎస్‌ ఓటమి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత ప్రజలు ఎక్కువగా చర్చించుకున్న విషయాలలో ఒకటి తరువాత ఐటీ మినిస్టర్‌ ఎవరు అని. ఐటీ మినిస్టర్ గా కేటిఆర్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఐటీ ఉద్యోగుల నుండి ఆయన లేకపోవడం లోటుగానే ఉంటుందన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే కేటీర్ కి ధీటుగా ఆ స్థానంలోకి అందరూ ముందు నుండి ఊహించినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం దుద్ధిల్ల శ్రీధర్ బాబుని ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించడం జరిగింది.

ఆల్ రౌండర్ శ్రీధర్ బాబు…

దుద్దిల్ల శ్రీధర్ బాబు 1969 మార్చి 30న ప్రముఖ కాంగ్రెస్ నేత అయిన మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు, జయమ్మలకు జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యను అభ్యసించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 1998లో న్యాయవాద వృత్తిని చేపట్టారు. తన తండ్రి మరణంతో అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు 1999లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. అంతే కాకుండా రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, లీగల్ మెట్రాలజీ, శాసన వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంథని నుండి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన పీవీ నరసింహరావు గారి రికార్డును తిరగరాస్తూ అయిదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఈయన గురించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే నిజాం కళాశాలలో చదివేటప్పుడు హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి క్రికెట్‌లో ప్రాతినిధ్యం కూడా వహించారు. ఇలా అన్నింట్లో ఆల్ రౌండర్ గా ఉండి, మంచి నాయకుడిగా కూడా నిరూపించుకున్న శ్రీధర్ బాబు ఐటీ మంత్రిగా కూడా రాణిస్తారని అందరూ కోరుకుంటున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago