Yatra 2 : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి సీఎం అయ్యారు. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘యాత్ర’. పోయినసారి ఎలక్షన్ టైంలో ఆ సినిమా వచ్చి ఎన్నికల్లో జగన్ కి ఎంతో కొంత ఉపయోగపడిందని చెప్పొచ్చు. తాజాగా యాత్ర సినిమాకి కొనసాగింపుగా వస్తోన్న ‘యాత్ర 2, ది రైజ్ అఫ్ ది లీడర్’ సినిమాకి సంబంధించిన అప్ డేట్ విడుదల చేసింది చిత్ర బృందం.
అచ్చు భారతి లాంటి అమ్మాయినే పట్టుకొచ్చిన డైరెక్టర్…
ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మకే ఉన్న క్రెడిట్ ఇపుడు డైరెక్టర్ మాహి.వి.రాఘవ కి వచ్చింది. బయోపిక్ తీసేటపుడు సేమ్ తో సేమ్ ఉండే మనుషులను రామ గోపాల్ వర్మ పట్టుకొచ్చి జనాలను ఆశ్చర్య పరుస్తుంటాడు. అలానే ఇపుడు డైరెక్టర్ మహి.వి.రాఘవ కూడా అచ్చం ఆంధ్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి లాగే ఉన్న అమ్మాయిని యాత్ర సినిమా కోసం తీసుకోచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు.
యాత్ర 2 సినిమా రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్ రాజకీయ ప్రస్థానం గురించి వస్తోన్న సినిమా. ఇందులో అయన భార్య భారతి గారి పాత్ర కీలకంగా ఉండనుంది. అందుకే భారతి గారి లాగే ఉన్న కేతకి నారాయణ్ అనే బ్యూటీని ఈ సినిమా కోసం తీసుకున్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్స్ లోకి రానుంది. ఇక ఈ సినిమాను త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…