Virat Kohli: విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ ద్వారా ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Virat Kohli: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి వామికా అనే గారాలపట్టి రావడంతో వీరి జీవితం మరింత సంతోషంగా సాగిపోతుందని చెప్పాలి. విరాట్ కోహ్లీ అనుష్క శర్మ వృత్తిపరంగా సెలబ్రిటీలు కావడంతో వీరికి ఏ రేంజిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో మనకు తెలిసిందే.
ఇలా వీరిద్దరు వృత్తి పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఇలా సోషల్ మీడియా ద్వారా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ జంట వీరికి సంబంధించి కేవలం ఒక పోస్ట్ చేయడం ద్వారా సోషల్ మీడియాలో ఎన్నో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి.
ఇకపోతే ఇప్పటి వరకు వీరికి సంబంధించిన ఎన్నో ఫోటోలను షేర్ చేసినప్పటికీ వీరి కూతురి వామిక ఫోటోని మాత్రం ఇప్పటివరకు చూపించలేదు.దీంతో ఎంతో మంది అభిమానులు వీరి గారాల పట్టిన చూడటానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. జనవరి 11వ తేదీ అనుష్క శర్మ తన కూతురికి జన్మనిచ్చి ఏడాది అవుతుంది. దీంతో ఆ రోజైనా తన కూతురు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తారని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఇలా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి విరాట్ కోహ్లీ కేవలం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తే ఈయన సుమారు 680,000 డాలర్లు సంపాదిస్తారు. మన భారత దేశ కరెన్సీ ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 5.08 కోట్లు అందుకు ఉంటున్నట్లు తెలుస్తోంది.ఇలా సోషల్ మీడియా ద్వారా విరాట్ కోహ్లీ భారీ మొత్తంలోనే సంపాదిస్తున్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం ఈయనకు ఇంస్టాగ్రామ్ లో 177 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…