Categories: FeaturedMovie News

కేవలం శృంగారం కోసమే నేను ట్రాన్స్ జెండర్ గా మారలేదు! జబర్దస్త్ ఆర్టిస్ట్ సాయితేజ బోల్డ్ కామెంట్స్ !!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన సాయితేజ జబర్దస్త్ లో ఎన్నోస్కీట్లలో లేడీ గెటప్ లో వేసి ప్రేక్షకులను అలరించారు. ఈమధ్య జబర్దస్త్ నుంచి సడెన్ గా మాయమైన సాయి తేజ లింగమార్పిడి ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారి పింకీ గా పేరు మార్చుకుని అందరికీ షాకిచ్చాడు. దాంతో పింకీకి సంబంధించి వార్తలు ఈమధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. జబర్దస్త్ కామెడీ షో స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి ప్రేక్షకులందరూ నవ్వుకుంటున్నా ఆ షోలో నటించే ఆర్టిస్ట్ లు మాత్రం నిజ జీవితంలో చాలా బాధలు పడుతున్నరనడానికి జబర్దస్త్ షో ఆర్టిస్ట్ సాయి తేజ రియల్ లైఫే ఒక ఉదాహరణ.

సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన తర్వాత కూడా తనని చాలా మంది వేధించారని.. ఇష్టమొచ్చినట్లు విమర్శించారని ఈ మధ్య ఓ Tv ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది ప్రియాంక. “ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ బయటి మాత్రం కొందరు పనీపాట లేని వెధవలు నాపై కామెంట్స్ చేస్తుంటారు. ట్రాన్స్ జెండర్ కావడం అంత ఈజీ కాదు. అమ్మాయిగా మారినప్పుడు చాలా నొప్పిని భరించాను. ట్రాన్స్ జెండర్స్ అంటే ప్రాస్టిట్యూట్ గానే చూస్తుంటారు. ఎవరికి ఏమనిపిస్తే అది చేస్తారు. చాలామంది సెక్స్ కోసమే ట్రాన్స్ జెండర్స్ గా మారుతుంటారు. అలాంటి వాళ్ళకు చేజేతులా జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్తున్నాను. ఇక నా పర్సనల్ లైఫ్ లో కేవలం సెక్స్ కోసమే.. నేను అమ్మాయిగా మారలేదు. నన్ను నేను స్టార్ గా చూసుకోవాలనే తపనతోనే ప్రియాంకగా మారాను. నా టార్గెట్ ఒక్క జబర్దస్త్ మాత్రమే కాదు. నేనింకా మంచి స్టార్ నవ్వాలి. పెద్ద మోడల్ అవ్వాలి. అందుకోసం నేనీమధ్య జీరో సైజ్ కోసం ట్రై చేస్తున్నాను.

టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మోడలింగ్ చేస్తున్నాను. కన్నడలో కొన్ని సినిమాలలో నటించాను కాబట్టి అక్కడ కూడా మంచి ఛాన్స్ లు వస్తున్నాయి. నా కెరీర్ మంచి పొజిషన్ కి వస్తున్నప్పుడే నేను అమ్మాయిగా మారిపోలని నిర్ణయించుకున్నాను. లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకునే సమయంలో భరించలేనంత నొప్పి వచ్చేది. బెడ్ మీద నుంచి వాష్ రూంకి వెళ్లాలంటేనే 20 నిమిషాలు పట్టేది. నేను చిన్నప్పటి నుంచి అమ్మాయిగా మారాలని అనుకునేదాన్ని.. నాకు పాతికేళ్ళు వచ్చిన తర్వాత.. నా బాడీలో వచ్చిన మార్పులను గమనించి టాన్స్ జెండర్‌గా మారాను. అమ్మాయిగా మారకముందు జబర్దస్త్ టీమ్ మెంబర్స్ తో ఎలా ఉన్నానో.. ఇప్పుడు కూడా అలానే ఉంటున్నాను. ట్రాన్స్ జెండర్‌గా మారానని వాళ్లు నాకు ఛాన్సులు ఇవ్వకపోవడం.. వేరు చేయడం లాంటివి లేవు” అంటూ ప్రియాంక తన మనోభావాలను తెలియ జేసింది. ప్రస్తుతానికి ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. కావాలంటే మీరూ చూడండి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago