Categories: FeaturedMovie News

బాలీవుడ్ హీరో సుశాంత్ కేసులోని సిద్ధార్థ్ పితానీ ఎవరు.? ఈ తెలుగబ్బాయికి సుశాంత్ కేసుకి సంబంధం ఏంటి?

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తూ క్రొత్త మలుపులు తిరుగుతుంది. ఇన్ని రోజులు సుశాంత్ బలవాన్మరణం పొందాడనుకుంటున్న కేసును ఇప్పుడు పాట్నా పోలీసులు దర్యాప్తు చేస్తుండటంతో జరుగుతున్న పరిణామాలను, నడుస్తున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే సుశాంత్ ఉరి వేసుకునెంత పిరికి వాడు కాదని తాజాగా సుశాంత్ ఫ్యామిలీ ఫ్రెండ్ స్మితా పారిఖ్ సంచలన కామెంట్స్ చేశారు.

సుశాంత్ ది బలవాన్మరణం కాదని తాము ముందు రోజు నుంచి చెబుతున్నామని, సుశాంత్ కుటుంబ సభ్యులదీ ఇదే అభిప్రాయమని, సుశాంత్ బలవన్మరణం పొందినట్టు చెబుతున్న వస్త్రానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు ఇప్పటికీ బయటికి రాలేదని, ఈ సంఘటన జరిగిన జూన్ 14న పితానీ, శామ్యూల్ అనే ఇద్దరు వ్యక్తులే అక్కడ ఉన్నారని, వీరిద్దరూ సుశాంత్ సాంకేతిక వ్యవహారాలను చూస్తుంటారని ఈ సందర్భంగా పారిఖ్ తెలియజేశారు. మరోవైపు సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. సుశాంత్ వద్ద జీరో బ్యాలన్స్ ఉన్నా.. అతడి దగ్గర్నుంచి 50 కోట్లు కాదు కదా 100 కోట్లు తీసుకుపోయినా కూడా అతను ప్రాణం తీసుకునేంత చేసుకునేంత పిరికివాడు కాదని.. మళ్లీ ఆ డబ్బును సంపాదించే తెలివి, ధైర్యం 2 ఉన్నవాడంటూ అంకిత చెప్పుకొచ్చింది. సినీ ఫక్కీలో రోజుకో క్రొత్త మలుపు తిరుగుతున్న ఈ కేసులో ఇప్పుడు అందరి దృష్టి ఓ వ్యక్తి పైనే వుంది.

అతడే సిద్ధార్థ్ పితానీ. తెలుగబ్బాయే. సినిమా రంగంపై ఇంట్రస్ట్ తో జైపూర్‌లో పని చేస్తున్న సిద్ధార్థ్‌.. 2019లో సుశాంత్‌ కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత సుశాంత్ సింగ్‌ కు రూమ్ మేట్ గా మారిన సిద్ధార్థ్.. సుశాంత్ చనిపోయిన రోజు అతడి ఫ్లాట్‌లోనే వుండటంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అతడి పేరే ఎక్కువగా వినబడుతుంది. సుశాంత్ బలవాన్మరణం పొందిన టైంలో తలుపులు తెరుచుకోవడం లేదంటూ సుశాంత్ సింగ్ అక్కకు ఫోన్ చేసి తలుపులు తెరిపించింది కూడా సిద్ధార్థ్ పితానీయే కావడం విశేషం. అయితే సోషల్ మీడియాలో మాత్రం రియా, సుశాంత్ మధ్య అసలేం జరిగింది.? వాళ్లిద్దరూ ఎప్పట్నుంచి కలిసుంటున్నారు.? మొదలైన విషయాలన్నీ సిద్ధార్థ్‌కు బాగా తెలుసనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ సిద్ధార్థ్ మాత్రం ఎంత సుశాంత్‌ తో కలిసి ఒకే ఇంట్లోనే ఉన్నా కూడా అసలేం జరిగిందో తనకు తెలియదంటూ చెప్తున్నాడు. కానీ అతని మాటలను ఎవరూ అంత ఈజీగా నమ్మడం లేదు. ఈ కేసులో ఎవరూ ఊహించని మరో ట్విస్ట్ ఏమిటంటే.. తనను రియాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని సుశాంత్ ఫ్యామిలీ మెంబర్స్ బెదిరిస్తున్నారని సిద్ధార్థ్ పితానీ ముంబై పోలీసులకు ఈమధ్యనే మెయిల్ షేర్ చేసాడు. దీంతో సుశాంత్ కేసు చాలా మలుపులు తిరిగేలా కనబడుతుంది. సిద్ధార్థ్ పితానీ పేరు కూడా సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. మొత్తానికి సుశాంత్ కేసులో అసలేం జరిగింది.? అనే అంశంపై సిద్ధార్థ్ నోరు విప్పితే కానీ అసలు నిజాలు బయటికి రావంటున్నారు బీహార్ పోలీసులు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago