Categories: FeaturedMovie News

జబర్దస్త్ ఆనంద్ పడిన సినిమా కష్టాలు.. చదివితే మీ కళ్ళు చెమ్మగిల్లాల్సిందే.!

బుల్లితెరపై అలరిస్తున్న షోలలో ‘జబర్దస్త్’ కామెడీ షో ఒకటి. ఏడేళ్ల క్రితం మొదలైన జబర్దస్త్ ప్రయాణం.. సరికొత్తగా సాగుతూనే ఉంది. జబర్దస్త్ మంచి సక్సెస్ కావడంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా మొదలుపెట్టారు. అయితే ఎక్స్ ట్రా జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర స్కిట్ కి విశేష ఆదరణ లభించేది. చంద్ర స్కిట్ లో సత్తిబాబుతో చంద్ర ఆడుకునే ప్రతి డైలాగ్ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. అయితే చమ్మ చంద్ర ఇప్పుడు జబర్దస్త్ ని వదిలి నాగబాబుతో పాటుగా ‘అదిరింది’ షో లోకి షిఫ్ట్ అయిపోయాడు.

ప్రస్తుతం ఇప్పుడు సత్తిబాబు టీమ్ లీడర్ అయిన విషయం తెలిసిందే. చంద్ర టీంలోనే చేస్తున్న సత్తిపండుతో పాటు ఆనంద్ ను కలిపి టీం లీడర్స్ ను చేసారు. ఈ టీంకు సరదా సత్తిపండు, అదుర్స్ ఆనంద్ అని పేర్లు కూడా పెట్టారు. సత్తిపండు టీమ్ లో అదుర్స్ ఆనంద్ కి మంచి క్రేజ్ ఉంది. తనదైన కామెడీ పంచ్ డైలాగ్స్ తో కూల్ గా నవ్విస్తుంటాడు. ఆడ వేషాల్లో కూడా ఆనంద్ అదరగొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ… తనకు జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ వేదికను ఏనాటికీ వదిలి వెళ్లే ప్రసక్తే లేదని, ఈ షోలో రోజాగారు తమకు ఇచ్చిన ప్రోత్సాహం జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేమని.. ప్రస్తుతం జబర్దస్త్ టీమ్ మంచి పొజీషన్లో ఉన్నారంటే ఆమె ఆదరణ, ప్రోత్సాహమే కారణమని, తోటి యాంకర్లు అనసూయ, రష్మి లు చాలా సరదాగా ఉండేవారని, ఎప్పుడూ తమతో చాలా హ్యాపీగా ఉంటారని.. వారిపై పంచ్ లు వేసినా కూడా
అపార్థం చేసుకోకుండా టీమ్ సభ్యులను ప్రోత్సహిస్తుంటారని తెలియజేశాడు.

అలాగే ప్రస్తుతం జబర్దస్త్ టీం లీడర్‌గా ఉన్న అదుర్స్ ఆనంద్ జబర్దస్త్ టీమ్ లో తను జాయిన్ కాకముందు హైదరాబాద్ లో తను పడిన కష్టాలను కూడా వివరించాడు. *మాది మధ్యతరగతి కుటుంబం. మా మావయ్య చేసిన మోసంతో అమ్మ దగ్గరున్న ఆస్తి మొత్తం పోయింది. ఆమె ఎంతో భద్రంగా దాచుకున్న నగలను కూడా లాగేసుకున్నాడు. కాని తన కొడుకు ఏదైనా సాధించగలడనే నమ్మకంతో తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మేసి నన్ను హైదరాబాద్ పంపించింది. పదో తరగతి పూర్తి కాగానే అమ్మ మంగళ సూత్రం అమ్మి ఇచ్చిన డబ్బులతో హైదరాబాద్ వచ్చేశాను. ఇక్కడ ఎవరూ నాకు తెలియదు. ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు. మళ్లీ మావయ్యే ఆదుకుంటాడని వెళ్తే ఆయన నన్ను నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు..

నేనెప్పుడూ హైదరాబాద్ రాలేదు. తీరా వచ్చాక ఏం చేయాలో కూడా తెలియని అయోమయ పరిస్థితి. రోజుకొక పూట భోజనం చేసి దిల్‌సుఖ్‌ నగర్ బస్ స్టాండ్ దగ్గర పడుకునే వాడిని. కానీ…పోలీసులు పడుకోనిచ్చేవారు కాదు.. కొట్టేవారు. మా అమ్మ నా కష్టాన్ని చూసి.. వెంటనే హైదరాబాద్ వచ్చేసింది. కాని అన్ని రోజులూ నేను పడిన కష్టం ఊరికే పోలేదు. జబర్దస్త్ పుణ్యమాని పదేళ్లలోనే టీం లీడర్ అయ్యాను. సొంతంగా ఇల్లు కొనుకున్నాను. ఎవరైతే నన్ను నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళారో వాళ్లే నన్ను చూసి అసూయ పడేలా.. హ్యాపీ లైఫ్ అందించింది ‘జబర్దస్త్’ అంటూ తన కష్టం వెనుక ఉన్న కన్నీటి కథను తెలియజేసి ప్రేక్షకులందరితోనూ కంటతడి పెట్టించాడు మన జబర్దస్త్ కమెడియన్ ఆనంద్.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago