Categories: FeaturedMovie News

సుశాంత్ సింగ్ ఆత్మతో కబుర్లు !! (సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న వీడియో)

స్టీవ్ హుఫ్.. ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్.. గత పదేళ్ళగా ఆయన ఈ పని చేస్తూ వస్తున్నారు. ఈ అసాధారణ పని కోసం ఎన్నో అత్యుత్తమైన పరికరాలను కూడా కనుగొన్నాడు. గతంలో కొంతమంది ప్రముఖుల ఆత్మలతో కూడా ఆయన మాట్లాడినట్లు నెటిజన్లు చెబుతున్నారు. ఇటీవల ఆయన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మను సంప్రదించాడు. వినడానికే షాకింగ్ గా వున్న ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం యావత్ భారత దేశాన్ని కుదిపేసింది. అటు సుశాంత్ ఫ్యాన్స్, ఇటు సినీ ప్రముఖులు సుశాంత్ లేడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ కేవలం డిప్రెషన్ వల్లనే బలవన్మరణం చేసుకుని చనిపోయాడని కొందరంటుంటే.. లేదు ప్లాన్ చేసి చనిపోయేలా చేసారని మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో మాత్రం బలవన్మరణం అనే తేలింది. మొత్తానికి ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానులు.. సుశాంత్ మరణం వెనుక ఒక రహస్యంగానే దాగి ఉన్నాయని సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సుశాంత్ ఆత్మ తనతో మాట్లాడిందని ఒకరు చెప్పడం సంచలనంగా మారుతుంది. ఆత్మలతో మాట్లాడే ప్రక్రియను పారానార్మల్ యాక్టివిటీ అంటారు. చనిపోయిన వ్యక్తులతో మాట్లాడే పరికరాలు కూడా ఉన్నాయని కొందరు చెప్తుంటారు.

తాజాగా సుశాంత్ ఆత్మతో కూడా ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్‌ స్టీవ్ హుఫ్ మాట్లాడాడని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆయన కూడా ట్వీట్ చేసాడు. సుశాంత్ ఆత్మను సంప్రదించాలని ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్‌ స్టీవ్ హుఫ్‌కు కొద్దిరోజులుగా ఫ్యాన్స్, నెటిజన్ల నుండి ఈ- మెయిల్స్, మెసేజ్స్ వచ్చాయట. ఇక ఆయన జూలై 13వ తేదీన ఆస్ట్రల్ డోర్ వే సహకారంతో సుశాంత్ ఆత్మను సంప్రదించాడట. ఇందుకు సంబంధించిన వీడియోను తన పేస్ బుక్, యూ ట్యూబ్ ఛానల్స్‌లో షేర్ చేయగా.. అందులోని వీడియో ప్రకారం.. ”హుఫ్ ఒక పరికరం ద్వారా ఆత్మల ప్రపంచంతో కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అతడు సుశాంత్‌ ఆత్మతో మాట్లాడాడు. పలు ప్రశ్నలను కూడా అడిగాడు. సుశాంత్ ఆత్మతో పాటు ఒక మగ ఆత్మ.. ఆ తర్వాత మహిళ శబ్దాలు వినిపిస్తాయి. ఇక ఆ మహిళ ”ఇది ముగుస్తోంది’ అని చెబుతుంది. దాంతో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక దీనికి ఫాలో అప్ కూడా ఒక రేంజ్ లో ఉంటుందని స్టీవ్ ఫ్యాన్స్‌కు స్పష్టం చేయడం విశేషం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago