స్టీవ్ హుఫ్.. ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్.. గత పదేళ్ళగా ఆయన ఈ పని చేస్తూ వస్తున్నారు. ఈ అసాధారణ పని కోసం ఎన్నో అత్యుత్తమైన పరికరాలను కూడా కనుగొన్నాడు. గతంలో కొంతమంది ప్రముఖుల ఆత్మలతో కూడా ఆయన మాట్లాడినట్లు నెటిజన్లు చెబుతున్నారు. ఇటీవల ఆయన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మను సంప్రదించాడు. వినడానికే షాకింగ్ గా వున్న ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియానే షేక్ చేస్తుంది. వివరాల్లోకి వెళ్తే..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం యావత్ భారత దేశాన్ని కుదిపేసింది. అటు సుశాంత్ ఫ్యాన్స్, ఇటు సినీ ప్రముఖులు సుశాంత్ లేడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ కేవలం డిప్రెషన్ వల్లనే బలవన్మరణం చేసుకుని చనిపోయాడని కొందరంటుంటే.. లేదు ప్లాన్ చేసి చనిపోయేలా చేసారని మరికొందరు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో మాత్రం బలవన్మరణం అనే తేలింది. మొత్తానికి ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానులు.. సుశాంత్ మరణం వెనుక ఒక రహస్యంగానే దాగి ఉన్నాయని సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సుశాంత్ ఆత్మ తనతో మాట్లాడిందని ఒకరు చెప్పడం సంచలనంగా మారుతుంది. ఆత్మలతో మాట్లాడే ప్రక్రియను పారానార్మల్ యాక్టివిటీ అంటారు. చనిపోయిన వ్యక్తులతో మాట్లాడే పరికరాలు కూడా ఉన్నాయని కొందరు చెప్తుంటారు.

తాజాగా సుశాంత్ ఆత్మతో కూడా ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్ స్టీవ్ హుఫ్ మాట్లాడాడని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆయన కూడా ట్వీట్ చేసాడు. సుశాంత్ ఆత్మను సంప్రదించాలని ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్ స్టీవ్ హుఫ్‌కు కొద్దిరోజులుగా ఫ్యాన్స్, నెటిజన్ల నుండి ఈ- మెయిల్స్, మెసేజ్స్ వచ్చాయట. ఇక ఆయన జూలై 13వ తేదీన ఆస్ట్రల్ డోర్ వే సహకారంతో సుశాంత్ ఆత్మను సంప్రదించాడట. ఇందుకు సంబంధించిన వీడియోను తన పేస్ బుక్, యూ ట్యూబ్ ఛానల్స్‌లో షేర్ చేయగా.. అందులోని వీడియో ప్రకారం.. ”హుఫ్ ఒక పరికరం ద్వారా ఆత్మల ప్రపంచంతో కనెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అతడు సుశాంత్ ఆత్మతో మాట్లాడాడు. పలు ప్రశ్నలను కూడా అడిగాడు. సుశాంత్ ఆత్మతో పాటు ఒక మగ ఆత్మ.. ఆ తర్వాత మహిళ శబ్దాలు వినిపిస్తాయి. ఇక ఆ మహిళ ”ఇది ముగుస్తోంది’ అని చెబుతుంది. దాంతో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక దీనికి ఫాలో అప్ కూడా ఒక రేంజ్ లో ఉంటుందని స్టీవ్ ఫ్యాన్స్‌కు స్పష్టం చేయడం విశేషం.



























