Categories: FeaturedMovie News

కమెడియన్ నరేష్ వయసు ఏంతో తెలుసా ? అతని జీవితంలో ఇంత విషాదముందా.?

ఈటీవీలో వస్తున్న ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షో గురించి తెలియని ప్రేక్షకులుండరు. ఈ షోలో మోస్ట్ పాపులర్ కమెడియన్ నరేష్ వేసే పంచ్ లకూ, అతని కామెడీ టైమింగ్ కి మంచి క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. చూడటానికి మిరప కాయ్‌ లా ఉన్నా కూడా ఆయన పేల్చే కామెడీ పంచ్ లు మాత్రం చాలా ఘాటుగానే ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ మధ్యనే జబర్దస్త్ భాస్కర్ టీమ్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో కమెడియన్ నరేష్ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అవేమిటో తెలిస్తే మీరూ కూడా షాకవుతారు.

వరంగల్ జిల్లా జనగాంకు సమీపంలోని అనంత పురం అనే ఊళ్లో పుట్టి పెరిగిన నరేష్, బాల్యం నుండే ఎదుగుదల లోపంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. కానీ.. ఆ లోపమే ఇప్పుడతనికి దేవుడిచ్చిన వరంగా మారింది. పదేళ్ల పిల్లాడిలా కనిపించే నరేష్ ప్రస్తుత వయసు 20 ఏళ్లంటే ఎవ్వరైనా ఆశ్చర్య పోవల్సిందే.! 2000లో పుట్టిన నరేష్, చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే బాగా ఇష్టపడేవాడు. ఆ ఆసక్తితోనే ఈటీవీలోని ఢి షోకు సెలెక్టయ్యాడు. అప్పట్నుండి నరేష్ నటనా ప్రస్ధానం మొదలైంది. ఢీ షో జూనియర్స్‌ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌ గేటు బయటే తచ్చాతుంటే నరేష్ ని చూసిన సునామీ సుధాకర్ వెంటనే అతడిని పరిచయం చేసుకుని చలాకీ చంటి టీమ్ లో జాయిన్ చేశాడు. ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీమ్ లోకి జంప్ చేసిన నరేష్ జాతకం అక్కడ్నుంచి మారి పోయింది. ఇక అప్పట్నుంచీ నరేష్ కూడా స్టార్ కమెడియన్ గా ఎదిగి పోయాడు. ముఖ్యంగా తనదైన పంచ్ లతో ప్రేక్షకులకు పిచ్చెక్కిస్తూ పిచ్చ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

సాధారణంగా జబర్దస్త్ కోసం అందులో నటించే ఆర్టిస్టులందరూ స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు.. కానీ నరేష్ మాత్రం అలా ప్రాక్టీసు చేయడు. ఒక్కసారి స్క్రిప్ట్ ఏమిటి, స్కిట్ స్టార్టింగ్.. మిడిల్.. ఎండింగ్ ఏమిటనేది తెలిస్తే చాలు.. ఇక ఆ స్కిట్ ను ఆది నుండి అంతం వరకూ గుర్తు పెట్టుకుని స్టేజ్‌ పై పర్ఫార్మ్ చేయడం నిజంగా గొప్ప టాలెంట్ అంటూ, కమెడియన్ నరేష్ వల్లే తమ టీమ్ కు ఇంతమంచి పేరొచ్చిందని బుల్లెట్ భాస్కర్ కూడా చాలా సందర్భాలలో తెలియ జేయడం విశేషం.

జబర్దస్త్ షో లోకి అడుగు పెట్టిన తర్వాతే నరేష్ తన సొంత ఊళ్లో ఇల్లు కట్టుకున్నాడు. సిటీలో కూడా ఓ ఫ్లాట్ తీసుకున్నాడు. ఇదంతా బాగానే వుంది. కానీ., చివరిగా నరేష్ కోసం చెప్పదగిన అంశం ఏమిటంటే.. అతనికున్న ఎదుగుదల లోపం భవిష్యత్ లో కూడా నయమయ్యే సూచనలు లేవని, ఒకవేళ ప్రయత్నించినా అది చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యమని నరేష్ స్వయంగా తెలియ జేయడం కొంచెం బాధాకరమైన విషయమే.! ఇన్నాళ్ళు ‘జబర్దస్త్’ ఖతర్నాక్ కామెడీ షోలో ప్రేక్షకులందర్నీ కడుపుబ్బా నవ్విస్తున్న నరేష్ వ్యక్తిగత జీవితంలో ఇంత విషాదం దాగుందని తెలియడంతో నెటిజన్లతో పాటు నరేష్ ఫ్యాన్స్ కూడా కంటతడి పెడుతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago