చిన్నా చితకా పాత్రలతో తెలుగు తెరకు పరిచయమైన జబర్దస్త్ కమెడియన్ నవీన్, చాలా సినిమాల్లోనే నటించాడు. అయినా అవేమీ ఆయనకి పెద్దగా గుర్తింపును తీసుకు రాలేదు. ‘జబర్దస్త్’ కామెడీ షోతో ఆయనకి ఒక్కసారిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత జబర్దస్త్ నవీన్ కాస్తా గడ్డం నవీన్ గా కూడా పాపులరయ్యాడు. జబర్దస్త్ షోలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ నటుడు.
జబర్దస్త్ నవీన్ ప్రస్తుతం టాలీవుడ్ మరియు బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసున్నవాడే. ముఖ్యంగా “జబర్దస్త్” షోలో ‘అదిరే అభి’ స్కిట్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై కూడా మన గెడ్డం నవీన్ కు జూనియర్ రాఘవేంద్రరావుగా మంచి పేరుంది. ప్రస్తుతానికి ఈయన కెరీర్ బాగానే వెళ్తుంది. ఆయన తన గత అనుభవాలు ఓ ఇంటర్వూలో గుర్తు చేసుకున్నాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “సినిమా రంగంలోకి రాక ముందు నేను ఆఫీస్ బాయ్ గా పనిచేసేవాడిని. ఆఫీసంతా ఊడవడం, టేబుల్స్ తుడవడం, టీలు సప్లై చేయడం, ఆఫీస్ ఫైల్స్ పట్టుకెళ్ళడం వంటి పనులన్నీ చేశాను. కానీ., ఆ టైంలో నేను చదువుకోవడానికి అవసరమైన పుస్తకాలను కొనడం కోసం మాత్రమే ఆ పనులన్నీ చేశాను. నేను ఆఫీస్ బాయ్ గా చేరిన ఆఫీసులోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాను. ఇప్పటికీ అక్కడే పని చేస్తున్నాను. కానీ షూటింగ్ టైంలో వాళ్ళ అనుమతి తీసుకునే వెళ్తుంటాను. కేవలం 650 రూపాయలతో మొదలైన నా జీతం ఇప్పుడు పాతికవేల రూపాయిలకి చేరుకుంది” అని చెప్పుకొచ్చాడు.
చాలా సాధారణమైన జీవన శైలిని గుర్తు చేస్తుండే ఈయన వాటం.. తెల్లగడ్డం చూసిన ఎవ్వరికైనా ‘ఈయన వయసు చాలా ఎక్కువగా ఉంటుంది.. ఎప్పుడో 30 ఏళ్ల క్రితమే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి వుంటాడు.. వయసు కూడా 60కి దగ్గరలో ఉంటుంది’ అనుకుంటారు. కానీ వాస్తవంగా జబర్దస్త్ నవీన్ వయసు తెలిస్తే మాత్రం నిజంగానే షాకవుతారు. జబర్దస్త్ నవీన్ ప్రస్తుత వయస్సు కనీసం 45 కూడా దాటలేదంటే నమ్మడం కొంచెం కష్టమైన విషయమే.! కానీ ఆయన పర్సనాలిటీని చూస్తుంటే మాత్రం అచ్చం 60 ఏళ్ళ ఓల్డ్ మేన్ లాగానే కనిపిస్తుంటాడు. 1997లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన.. తాను నటుడిగా పరిచయమైనప్పుడు ఫుల్ హెయిర్ స్టైల్ తో.. సూపర్ నిజంగానే హీరోలా ఉండేవాడు మన జబర్దస్త్ నవీన్. కానీ చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా వున్న వెంట్రుకలన్నీ ఊడి పోయాయని కామెడీగా తెలియజేస్తుంటాడు జబర్దస్త్ నవీన్. ఆ తర్వాత జుట్టు పోతే పోయింది. సినిమా ఛాన్స్ లు రావడం లేదనే మనస్తాపంతో గడ్డం పెంచానని.. ఆ గడ్డం పెరిగిన తర్వాతే తనకు సినిమా ఆఫర్లు రావడం మొదలుపెట్టాయని జబర్దస్త్ నవీన్ చెప్పడం విశేషం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…