Categories: FeaturedMovie News

నా భర్త వల్ల నేను పెళ్లైన 3వ రోజునే బయటకు వచ్చేశా !! అసలు నిజం చెప్పిన ప్రియమణి!?

సినిమా రంగంలో మంచి గుర్తింపును సంపాదించిన చాలామంది హీరోయిన్స్ పెళ్ళైన తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ నటి ప్రియమణి ఒకరు. కేరళలోని పాలక్కాడులో జన్మించిన ప్రియమణి ‘ఎవరే అతగాడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది.

యమదొంగ, మిత్రుడు, నవ వసంతం వంటి చిత్రాల ద్వారా వెండితెర కథానాయికగా నిలదొక్కుకున్న ప్రియమణి కోలీవుడ్‌ డైరెక్టర్ “భారతి రాజా” ద్వారా తమిళ సినీ రంగానికి పరిచయమైంది. కోలీవుడ్ లో కూడా ప్రియమణి నటించిన సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున, లెజెండ్ బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, గోపీచంద్, నితిన్ లాంటి ఆగ్ర హీరోలందరితోనూ నటించింది. కాంచీపురం సిల్క్స్‌కు మోడలింగ్ చేస్తూ హీరోయిన్‌గా ఎదిగిన ప్రియమణి ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ తో పాటు మలయాళ చిత్రాల్లో కూడా నటించింది ప్రియమణి. భయ్యా, ద్రోణ వంటి చిత్రాల్లో టాలీవుడ్ సెక్సీ తారగా అందాలను ఆరబోసిన ప్రియమణి ప్రముఖ బాలీవుడ్ సినీతార విద్యాబాలన్ కు సోదరి అన్న విషయం అందరికీ తెలియదు. తెలుగులో ‘మనవూరి రామాయణం’ చిత్రంలో చివరిసారిగా కనిపించిన ప్రియమణి ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలై పోయింది. అయితే పెళ్లైన తర్వాత ఈమధ్యనే తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన ప్రియమణి వరుస అవకాశాలతో అదర గొడుతోంది. 30 ఏళ్ళ వయస్సు పైబడిన ప్రియమణి ఈమధ్యనే తన చిరకాల ప్రేమికుడు ముస్తఫాను పెళ్లి చేసుకుంది.

పెళ్లైన తర్వాత మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి.. సినిమా కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేసింది. ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. ఒక సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌లో ముస్తఫాతో తనకు పరిచయం ఏర్పడిందని,. కొంత కాలం ఆయనతో ఓ బెస్ట్ ఫ్రెండ్ గా కలిసున్న తర్వాత ముస్తఫా తనపై చూపించిన అభిమానమే ఆయన్ని ప్రేమించేలా చేసిందని, పెళ్లైన తర్వాత సినీ రంగానికి దూరంగా ఉండాలన్న ఆలోచన తనకు లేదని, పెళ్లైన 3వ రోజునే షూటింగ్‌కు వెళ్లాననీ, భార్య వంటింటికే పరిమితం కావాలనే మనస్తత్వం తన భర్తది కాదని, ఆయన అంగీకారంతోనే తాను పెళ్ళి తర్వాత కూడా నటిస్తున్నానని తెలియ జేసింది. ఈ సందర్భంగా స్వతహాగా ముస్లిం మతస్తుడైన ముస్తఫాను తాను పెళ్లి చేసుకోవడాన్ని చాలా మంది వ్యతిరేకించారని, తన భర్త, తన కుటుంబం, తన వ్యక్తిగత జీవితం ఇవే తనకుకు ముఖ్యమని ప్రియమణి చెప్పడం విశేషం. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ మూలంగా ప్రియమణికి తమిళం, తెలుగు భాషల్లో ఛాన్స్ లు రాకపోవడంతో కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా వుందని సమాచారం.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago