సినిమా రంగంలో మంచి గుర్తింపును సంపాదించిన చాలామంది హీరోయిన్స్ పెళ్ళైన తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ నటి ప్రియమణి ఒకరు. కేరళలోని పాలక్కాడులో జన్మించిన ప్రియమణి ‘ఎవరే అతగాడు’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై టాలీవుడ్ లోని స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది.

యమదొంగ, మిత్రుడు, నవ వసంతం వంటి చిత్రాల ద్వారా వెండితెర కథానాయికగా నిలదొక్కుకున్న ప్రియమణి కోలీవుడ్ డైరెక్టర్ “భారతి రాజా” ద్వారా తమిళ సినీ రంగానికి పరిచయమైంది. కోలీవుడ్ లో కూడా ప్రియమణి నటించిన సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున, లెజెండ్ బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ, యంగ్ టైగర్ ఎన్టీఆర్, గోపీచంద్, నితిన్ లాంటి ఆగ్ర హీరోలందరితోనూ నటించింది. కాంచీపురం సిల్క్స్‌కు మోడలింగ్ చేస్తూ హీరోయిన్‌గా ఎదిగిన ప్రియమణి ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ తో పాటు మలయాళ చిత్రాల్లో కూడా నటించింది ప్రియమణి. భయ్యా, ద్రోణ వంటి చిత్రాల్లో టాలీవుడ్ సెక్సీ తారగా అందాలను ఆరబోసిన ప్రియమణి ప్రముఖ బాలీవుడ్ సినీతార విద్యాబాలన్ కు సోదరి అన్న విషయం అందరికీ తెలియదు. తెలుగులో ‘మనవూరి రామాయణం’ చిత్రంలో చివరిసారిగా కనిపించిన ప్రియమణి ఆ తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలై పోయింది. అయితే పెళ్లైన తర్వాత ఈమధ్యనే తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన ప్రియమణి వరుస అవకాశాలతో అదర గొడుతోంది. 30 ఏళ్ళ వయస్సు పైబడిన ప్రియమణి ఈమధ్యనే తన చిరకాల ప్రేమికుడు ముస్తఫాను పెళ్లి చేసుకుంది.

పెళ్లైన తర్వాత మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి.. సినిమా కెరీర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేసింది. ఇంటర్వ్యూలో ప్రియమణి మాట్లాడుతూ.. ఒక సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో ముస్తఫాతో తనకు పరిచయం ఏర్పడిందని,. కొంత కాలం ఆయనతో ఓ బెస్ట్ ఫ్రెండ్ గా కలిసున్న తర్వాత ముస్తఫా తనపై చూపించిన అభిమానమే ఆయన్ని ప్రేమించేలా చేసిందని, పెళ్లైన తర్వాత సినీ రంగానికి దూరంగా ఉండాలన్న ఆలోచన తనకు లేదని, పెళ్లైన 3వ రోజునే షూటింగ్‌కు వెళ్లాననీ, భార్య వంటింటికే పరిమితం కావాలనే మనస్తత్వం తన భర్తది కాదని, ఆయన అంగీకారంతోనే తాను పెళ్ళి తర్వాత కూడా నటిస్తున్నానని తెలియ జేసింది. ఈ సందర్భంగా స్వతహాగా ముస్లిం మతస్తుడైన ముస్తఫాను తాను పెళ్లి చేసుకోవడాన్ని చాలా మంది వ్యతిరేకించారని, తన భర్త, తన కుటుంబం, తన వ్యక్తిగత జీవితం ఇవే తనకుకు ముఖ్యమని ప్రియమణి చెప్పడం విశేషం. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ మూలంగా ప్రియమణికి తమిళం, తెలుగు భాషల్లో ఛాన్స్ లు రాకపోవడంతో కన్నడం, మలయాళం భాషల్లో నటిస్తూ బిజీగా వుందని సమాచారం.



























