Kirak RP: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ అందరికీ సుపరిచితమైనటువంటి కిరాక్ ఆర్పీ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున రాజకీయాల గురించి మాట్లాడుతూ సంచలనంగా మారిన సంగతి మనకు తెలిసిందే.ఈయన కూటమికి మద్దతు తెలుపుతూ అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ పై తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పట్ల దుర్భాషలాడుతూ ఉన్నారు. అయితే తాజాగా మరోసారి ఆర్పీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్ ఎన్నికలు పూర్తి కాగానే లండన్ వెళ్లిన సంగతి మనకు తెలిసిందే. జూన్ ఒకటవ తేదీ ఈయన తిరిగి ఇండియా రాబోతున్నారు.
ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ..టీడీపీ జనసేన బీజేపీ కూటమికి 145 నుంచి 160 సీట్లు రావడం ఖాయం. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏపీలో అడుగుపెట్టిన వెంటనే లాక్కెళ్లి లోపల పడేస్తారని, ఆయనకు జైలే గతి పట్టనుందని తెలిపారు.
పులుసు కారుతుంది..
ఇలా జగన్మోహన్ రెడ్డి గురించి ఆర్పీ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఈయన వ్యాఖ్యలపై స్పందించి జూన్ 4 తర్వాత నీకు పులుసు కారుతుందని, చేపల పులుసు రెస్టారెంట్ కూడా ఉండదు కాస్త జాగ్రత్త అంటూ వైఎస్ఆర్సిపి అభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…