Pitapuram: మరొక వారం రోజులలో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలబడుతున్నటువంటి తరుణంలో అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఏపీ ఎన్నికల ఫలితాలు ఒకవైపు అయితే పిఠాపురం ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు అనేలాగా ఉన్నాయి. ఇప్పటికే పిఠాపురం ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున స్టిక్కర్లను వేయించుకొని చక్కర్లు కొడుతున్నారు.
జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలుస్తారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఎమ్మెల్యే తాలూకా అంటూ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ స్టిక్కర్లతో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.
ఇలా జనసేన నాయకులు స్టిక్కర్లతో తిరగడంతో మేమేం తక్కువ కాదంటూ వైసీపీ నేతలు కూడా వంగా గీత ఫోటోతో పాటు డిప్యూటీ సీఎం అనే స్టిక్కర్లు వేయించుకొని మరి బండ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఇంకా ఎన్నికల ఫలితాలకు వారం గడువు ఉండగానే పిఠాపురంలో స్టిక్కర్ వార్ కొనసాగుతూ ఉండడంతో పిఠాపురం కాస్త మరోసారి వార్తలలో నిలిచింది.
కోట్లలో బెట్టింగులు..
మరి జూన్ 4వ తేదీ రాబోయే ఎన్నికల ఫలితాలలో పిఠాపురంలో ఎవరు విజయకేతనం ఎగరు వేస్తారు అన్న విషయంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. సినీ నటుడు పవన్ కళ్యాణ్ మొదటిసారి పిఠాపురంలో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడతారా లేకపోతే ఈసారి కూడా ఈయనకి నిరాశ తప్పదా అనేది తెలియాల్సి ఉంది అయితే ఇప్పటికే ఈ విజయం పై కోట్లలో బెట్టింగులు నడుస్తుండటం గమనార్హం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…