Navadeep: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ కూడా అదే స్థాయిలో ఆసక్తిని కల్పిస్తుంది. ఇటీవల ఓ ప్రముఖ వ్యాపారవేత పుట్టినరోజు సందర్భంగా బెంగళూరులోని ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు అయితే ఇందులో భాగంగా ఎంతోమంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఉండటంతో ఈ విషయం కాస్త సంచలనం గా మారింది.
ఇక ఈ పార్టీలో భాగంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారంటూ కొందరి పేర్లను కర్ణాటక పోలీసులు కూడా వెల్లడించారు. ఇందులో నటి హేమ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. అయితే తాజాగా ఈ పార్టీ గురించి నవదీప్ స్పందించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా కూడా పార్టీలు అన్నా, డ్రగ్స్ కేసులు అన్న మొదట వెలుగులోకి వచ్చేది నటుడు నవదీప్ పేరే.ఎక్కడ ఏ డ్రగ్ కేసులో విచారణ జరిగిన సినీ ఇండస్ట్రీ నుండి అటెండెన్స్ వేయించుకునే మొదటి వ్యక్తి ఆయనే. ఇదివరకు పోలీసులు అనేకమార్లు నవదీప్ ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ పేరిట విచారణ జరిపిన సంఘటనలు ఉన్నాయి.
మొదటిసారి నా పేరు లేదు..
ఇక మీడియా కూడా ఈయనని టార్గెట్ చేసేదని చెప్పాలి అయితే మొదటిసారి బెంగుళూరులో జరిగినటువంటి ఈ రేవ్ పార్టీలో మీడియా వారు గానీ పోలీసులు కానీ తన పేరును ప్రస్తావించకపోవడంతో చాలా సంతోషం వ్యక్తం చేశారు.ఇన్నాళ్లకు మీడియా తనని వదిలి పెట్టిందంటూ సంతోషపడుతూ మాట్లాడాడు. అలాగే తాను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్టు రూమర్స్ రాక పోవడంతో చాలా మంది నిరుత్సాహపడి ఉంటారని కాస్త సెటైర్ గా మాట్లాడాడు. కొందరు ఏంటన్న ఈ ఫేక్ న్యూస్ లో మీరు లేరా అంటూ నన్ను ప్రశ్నిస్తున్నారని ఈ సందర్భంగా నవదీప్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…